23, జనవరి 2009, శుక్రవారం

చదువులు మారాయి

మా చిన్నప్పుడు చదువులు కేజీలలో చడువుకుంతారుట అని ఆశర్యంగా చెప్పుకొనేవారు. కాని ఇప్పుడు జీబీ ( కంప్యూటర్ల కొలమానం) లలో చదువుకొంటున్నారు. కార్పోరేట్ స్కూల్స్ రూపాంతరం చెందుతూ కాన్సెప్ట్ స్కూల్స్, టెక్నో స్కూల్స్ వృద్ధి చెందుతున్నాయి. కార్పోరేట్ సంస్కృతి వృద్ధి చెందడానికి కారణాలు మాత్రం ప్రభుత్వ విధానంలోని లొసుగులు ఇంకా ఉపాధ్యాయులు. మా చిన్నప్పుడు ఉపాధ్యాయుడంటే ఊళ్ళో డాక్టర్ కి ఎంత గౌరవం ఉండేదో ఉపాధ్యాయుడంటే అంత గౌరవం ఉండేది. బడిలో టీచర్ కొట్టిందని అమ్మ నాన్నలకి చెప్పాలంటే భయంగా ఉండేది. నువ్వేం తప్పు చేసావో అని మళ్ళి అమ్మ నాన్నలు కోడతరాని. రోజులు మారాయి. ఉపాధ్యాయులు ఉపాధ్యాయులుగా కాకుండా కిరాతకులుగాను చెప్పలేని చేష్టలతో ఉంటున్నారు. నిజంగా విద్యార్ధికి భయం చేపుదామన్నా అటు తల్లి దండ్రులు కూడా ఒప్పుకోవడంలేదు. ఇలాంటి పరిస్తుతులలో మా అబ్బాయ్ ని ఒక టెక్నో స్కూల్ లో చేర్చాలని మా ఆవిడ పోరు పెడితే ఆ స్కూల్ చూడటానికి వెళ్ళాము. టెక్నో స్కూల్ అంటే ఆరవ తరగతి నుండి IIT కి సరిపడే విధంగా పిల్లలని తయారు చేస్తారుట. మా ఆవిడ చెప్పింది. కొత్త హంగులతో బాగానే ఉంది. ఉపాధ్యాయుల స్థానాలలో అన్ని చోట్లా కంప్యూటర్లు ఉన్నాయ్. తరగతి గదులలో ప్రొజెక్టర్లు ఉన్నాయ్. సినిమాలలో లాగ తెరలు కూడా ఉన్నాయ్. రిసెప్షన్ లో ఉన్న అమ్మిని అడ్మిషన్ విధానం ఎలా అని అడిగాను. మీ అబ్బాయి ఎంట్రన్స్ టెస్టు వ్రాయాలని చెప్పింది. దానికి ఫీజు ఏమైనా ఉందా అని అడిగితె ఫ్రీ సార్ అని చెప్పి అక్కడ అప్లికేషను తీసుకోండని మరో చోటు చూపించింది. అక్కడికి వెళ్లి క్యు లో నిలబడ్డాను. నా వంతు వచ్చాక కౌంటర్ లోని అమ్మి ఐదు వందలు ఇమ్మని అడిగింది. అదేమిటి ఎంట్రెన్స్ ఫ్రీ అన్నారుగదా అన్నాను. అవును సార్ , ఎంట్రెన్స్ టెస్టు ఫ్రీ , దరఖాస్తు మాత్రమె కొనాలి అని చెప్పింది. ఎంట్రెన్స్ లో పాస్ ఐన తరువాత గదా దరఖాస్తు అవసరం అన్నాను. కాదు ఎంట్రెన్స్ టెస్ట్ వ్రాయాలంటే దరఖాస్తు కొనాలని అమ్మి చెప్పింది. దీనిలో లాజిక్ ఆలోచిస్తుంటే మా ఆవిడ నా పర్సులోంచి డబ్బులు తీసే అమ్మి చేతిలో ఉంచింది. మరుసటి రోజు ఉండయాన్నే మా వాడి చేత ఆరవ తరగతికి ఎంట్రన్స్ రాయించాను. టెస్టు పూర్తి కాగానే మా వాడిని ఎలా వ్రాసావని అడిగాను. దానికి మా వాడు "నువ్వు ఈ స్కూల్ లో ఎందుకు చేరాలని అనుకుంటున్నావు అని అడిగారు" అన్నాడు. మరి ఏమి సమాధానం వ్రాసావని అడిగితె " మా పాత స్కూల్ లో పెద్ద ప్లే గ్రౌండ్ లేదు కాబట్టి" అన్నాడు వాడు. ఆరవ తరగతి కి వాళ్ళు అడిగే ప్రశ్నలు, వీడి సమాధానాలు ఏమి అనాలో అర్ధం గాక మాట్లాడక ఊరుకున్నాను. రెండవ రోజు అదే స్కూల్ నుండి ఫోన్ వచ్చింది. మీ వాడు ఎంట్రన్స్ టెస్ట్ లో పాస్ ఐయ్యాడు వచ్చి ప్రిన్సిపాల్ ను కలవమని. ఈ లోగ నాకు తెలిసిన విషయం టెక్నో స్కూల్ లో ఒకటవ తరగతి కూడా ఉందని. అంటే మొదటి తరగతి నుండి కూడా IIT కి ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పేస్తారా? అప్పటి నుండి నా మనసు మనసులో లేదు. స్కూల్ నుండి ఫోన్లు ఆగట్లేదు వచ్చి ఫీజు కట్టమని. నేను ఏమి చేయాలో అర్ధంగాని పరిస్తితి. టెక్నో మాయలో అందరిలాగే కొట్టుకు పోవడమేనా? అవును మరి చదువులు మారాయి. ఉపాధ్యాయులు మారారు. మనమూ మారాలి గాబోలు.

2 కామెంట్‌లు:

  1. అజ్ఞాతజనవరి 24, 2009

    మీ మనసుకు ఏది నచ్చితే (కరెక్ట్ అనిపించేది) అది చెయ్యండి.
    "మా చిన్నప్పుడు ఉపాధ్యాయుడంటే ఊళ్ళో డాక్టర్ కి ఎంత గౌరవం ఉండేదో ఉపాధ్యాయుడంటే అంత గౌరవం ఉండేది." మీరన్న ఈ ఒక్కమాట చాలు మీరు, తెలుగు మాధ్యమం లో చదువుకున్నా, మంచి ఉపాధ్యాయుడు అంటే ఎలా ఉండాలి, మంచి విద్యావిధానమంటే ఎలా ఉండాలన్న అవగాహన ఉన్న వాళ్లు అని. కాబట్టి మూస కొట్టుడు లో కాకుండా, మనసుకు నచ్చిన పని చేయండి. నేనూ ఈ మధ్య ఇలాంటి డైలమో లొ నే పడి, చివరకు మనసుకు నచ్చిన పనే చేసాను అది ప్రక్క ఇళ్ల వాళ్లకు, ఇంట్లో వాళ్లకు నచ్చక పోయినా.
    - Krishna

    రిప్లయితొలగించండి
  2. vidya vinayaani ivvali
    vinayam valla paatrata vastundi
    paatrata valla dhanam
    dhanam valla dharmam dharmam valla sukham!

    Itlaanti sumadhura subhaasishaatulu manaki cheppevi ee kaalam lo itla IT Techno maaayalo kottu koni pothoonte vichaarinchaalsi vastondi!

    zilebi.
    http://www.varudhini.tk

    రిప్లయితొలగించండి