సత్యం కంప్యూటర్స్ అధినేత రాజుగారు మొన్నటివరకు ఎందఱో యువకులకు అరాధ్య దైవం. సంస్థ అభివృధికి ఆయన పడ్డ శ్రమ వింటున్నప్పుడు ప్రతి ఒక్కరు ఆయన ఒక ఋషి అనుకొన్నారు. ప్రతి ఒక్కరు ఆయనలా కావాలని కలలు కన్నారు. రాష్ట్రానికే తలమానికంగా దేశానికి ఒక కలికి తురాయిలా సత్యం సంస్థ అభివృద్ది చెందినప్పుడు ప్రతీ ఒక్కరు తామే అభివృద్ధి చెందినట్టు తలంచారు. దేశ విదేశాలలో భారత ఖ్యాతి వ్యాపింపచేసిన సంస్థగా సత్యం కంప్యూటర్స్ నిలిచింది. 108 వాహన సేవలు ప్రారంభించినప్పుడు సత్యం కంప్యూటర్స్ ఒక దేవాలయంగా కనిపించింది. కాని అప్పుడే ఆయనలో మరో మనిషి ప్రవేసించాడని బహుశా ఆయనకికుడా తెలిసుండదు. అప్పుడే ఆయనలో ఒక రాజకీయ నాయకుడు ప్రవేశించి ఉంటాడు. సంస్థకి ఉన్నమంచి పేరును డబ్బుగా మార్చుకొనే దుర్భుద్ధి కలిగించి ఉంటాడు. సులభంగా కోట్లాది రూపాయాలు సంపాదించే దురాలోచన కలిగించి ఉంటాడు. అప్పటిను౦డే ఆయనలోని సత్యం బహుశా తప్పుకొని ఉంటాడు. సత్యం అసత్యం కాకుండా ఉంటే ఎంత బాగుండేది? ఇదంతా ఒక కలే , నిజం కాదు అని ఎవరినా చెపితే బాగుండేది. ఇప్పటికి ఆయనమీద అపనమ్మకం కలగట్లేదు. ఒక మంచి మనిషి మహిషిగా మారడం ....... ఒక కల చెదిరింది.
ఇప్పటికి ఆయనమీద అపనమ్మకం కలగట్లేదు....అవును. ఆయనను అరెస్టు చేసి జెయులికి పంపారంటీ కొంచం బాధగానే ఉంది. సమస్యలన్నీ తీరి వారు, వారి ఉద్యోగులు, వారి షేర్లు కొన్న వారందరూ బాగుండాలని కోరుకుందాము.
ప్రతీ గ్రహణం ఒక మలుపే. ప్రతి రాత్రి ఒక ఉదయానికి నాంది. అలాగే, ఎగిరే ప్రతి అలా కూలక మానదు. కూలడం అనేది సహజం అని తెలిసీ ఎగురుతుంది అల. ఒడుదుడుకులు ఉన్నాయని తెలిసీ ప్రయాణం చేస్తారు కొందరు. అలాంటి కొందరిలో వీరూ ఒక్కరు. నీళ్ళుంత సేపు మబ్బులు కురుస్తూనే ఉంటాయి. కానీ వాటి గమనం అక్కడితో ఆగదు, మరికొన్ని ఆవిర్లను చేర్చుకునె క్రమంలో మనకు కనబడకుండా సాగిపోతాయి. అలాంటి నీలి మేఘమే వీరు. ఏమో !! వీరినుంచి సత్యం దూరమైందని నేను భావించను, అలాంటి ఆలోచనా నా కలలో కూడా ఊహించను. infront crocodile..
సత్యం సంస్థలో రామలింగరాజుగారి శకం ముగిసింది. ఆయన మళ్ళీ పూర్వపు మనిషయ్యే అవకాశం లేదు. ముగిసిపోయేలా ఆయనే చేసుకున్నారు. ఆయన గతం చాలా గొప్పది. తెలుగువాడి చేతుల మీదుగా తెల్లవాళ్ళు జీతాలందుకొనే స్థితి కల్పించిన వాడాయన. కాని అది చివరికంటా నిలబెట్టుకొని ఉండాల్సిందని ప్రతి తెలుగువాడి ఆత్మా క్షోభిస్తోంది. ఆయన స్థాపించిన సత్యం సంస్థ మాత్రం ఏదోవిధంగా పదికాలాల పాటు నిలబడాలని హైదరాబాదు కేంద్రంగా తన సేవల్ని ఎప్పటిలానే కొనసాగించాలనీ కోరుకుందాం.
నిజమే జరిగినదంతా ఒక కల ఐతే బాగుండేది. మీ ఆవేదనే అందరి మనస్సులో ఉంది.
రిప్లయితొలగించండిమహేష్
ఇప్పటికి ఆయనమీద అపనమ్మకం కలగట్లేదు....అవును. ఆయనను అరెస్టు చేసి జెయులికి పంపారంటీ కొంచం బాధగానే ఉంది. సమస్యలన్నీ తీరి వారు, వారి ఉద్యోగులు, వారి షేర్లు కొన్న వారందరూ బాగుండాలని కోరుకుందాము.
రిప్లయితొలగించండిప్రతీ గ్రహణం ఒక మలుపే. ప్రతి రాత్రి ఒక ఉదయానికి నాంది. అలాగే, ఎగిరే ప్రతి అలా కూలక మానదు. కూలడం అనేది సహజం అని తెలిసీ ఎగురుతుంది అల. ఒడుదుడుకులు ఉన్నాయని తెలిసీ ప్రయాణం చేస్తారు కొందరు. అలాంటి కొందరిలో వీరూ ఒక్కరు.
రిప్లయితొలగించండినీళ్ళుంత సేపు మబ్బులు కురుస్తూనే ఉంటాయి. కానీ వాటి గమనం అక్కడితో ఆగదు, మరికొన్ని ఆవిర్లను చేర్చుకునె క్రమంలో మనకు కనబడకుండా సాగిపోతాయి. అలాంటి నీలి మేఘమే వీరు.
ఏమో !! వీరినుంచి సత్యం దూరమైందని నేను భావించను, అలాంటి ఆలోచనా నా కలలో కూడా ఊహించను. infront crocodile..
సత్యం సంస్థలో రామలింగరాజుగారి శకం ముగిసింది. ఆయన మళ్ళీ పూర్వపు మనిషయ్యే అవకాశం లేదు. ముగిసిపోయేలా ఆయనే చేసుకున్నారు. ఆయన గతం చాలా గొప్పది. తెలుగువాడి చేతుల మీదుగా తెల్లవాళ్ళు జీతాలందుకొనే స్థితి కల్పించిన వాడాయన. కాని అది చివరికంటా నిలబెట్టుకొని ఉండాల్సిందని ప్రతి తెలుగువాడి ఆత్మా క్షోభిస్తోంది. ఆయన స్థాపించిన సత్యం సంస్థ మాత్రం ఏదోవిధంగా పదికాలాల పాటు నిలబడాలని హైదరాబాదు కేంద్రంగా తన సేవల్ని ఎప్పటిలానే కొనసాగించాలనీ కోరుకుందాం.
రిప్లయితొలగించండి