1, జనవరి 2009, గురువారం

కొత్త సంవత్సరంలో నా కొత్త నిర్ణయం

కొత్త సంవత్సరం వస్తోంది. ప్రతీ ఒక్కరు చాల హుషారుగా ఉన్నారు. ప్రభుత్వాలు, పోలిసులు కొత్త కొత్త నియమాలు నిబధనలు పెట్టుకుంటున్నారు. అందిరికి చలా ఆశ, అన్ని మంచిగా మారిపోవాలని. నా మదిలో తళుక్కున ఆలోచన మెరిసింది. కొత్త సంవత్సరం లో నేను కూడా కొత్త జీవితం ప్రారంభించాలి. నా జీవితాంలో ఇకనుండి పాత జీవితానికి కొత్త జీవితానికి చాల తేడా ఉండాలి. మంచి అలవాట్లు చేసుకోవాలి. మరి నాకున్న చెడు అలవాట్లలో పొగ త్రాగటం ఒక్కటే. నాకిస్టమైన చార్మినార్ బ్రాండు సిగరెట్టు త్రాగటంలో ఉండే మజా దేనిలోనూ లేదు. కాని మా ఆవిడకి ఆ వాసన అస్సలు నచ్చదు. మీరు వస్తున్నారని ముందే తెలుసి పొతుంది లెండి అంటుంది. ఎలాగా అని అడిగితె మీ కన్నా ముందు పొగ వాసనే చెపుతుంది, మీరు వస్తున్నారని అంటుంది. పిల్లలు కూడా నా స్మోకింగ్ గురించి గొడవ చేస్తూనే ఉంటారు. ఇంతమందికి కష్టమైన నా చార్మినార్ బ్రాండ్ సిగరెట్ ధూమ పానం వదిలేస్తే? ఆహ ఏమి ఆలోచన? నిజంగా ఇంటిలో అందరు ఆనందిస్తారు. నా నిర్ణయానికి నేనే సంబర పడ్డాను. మరి ఈ రోజు ఆఖరి రోజు నా చార్మినార్ బ్రాండు సిగరెట్ ధూమ పానానికి. చివరిగా రోజు తీసుకొనే పాన్ డబ్బా దగ్గిర చార్మినార్ సిగరెట్టు తీసుకొని గుండెల నిండా పొగ పీల్చాను. స్వర్గంలో ఉన్నట్లు అనిపించింది. భారంగా ఇంటికి కదిలాను. కొత్త సంవత్సరం మొదటి రోజు వఛేసింది. నేను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడే ఉండాలనే అనుకున్నాను. నెమ్మదిగా బయటకి వచ్చేను. ఇంటి బయట పాన్ డబ్బా వాడు నన్ను చూసి చార్మినార్ సిగరెట్ బయట పెట్టాడు. నేను తల అడ్డంగా ఉపేను. వాడు ఆశ్చర్యంగా ఏం సార్ సిగేరట్లు మానేసారా అని ఆందోళనగా అడిగాడు. అవును అన్నాను. వాడు చాల నిరాశ పడినట్లు స్పష్టంగా తెలిసింది. నా నిర్ణయానికి నేనే గర్వ పడి "చార్మినార్ సిగరెట్టు మానేసాను గోల్డ్ ఫ్లేక్ ఇయ్యి " చెప్పాను.

4 కామెంట్‌లు:

  1. మాష్టారూ .. ఇంతకు ముందు తమరేమన్నా సినిమాలకు మాటలు వ్రాసే వారా..

    ఈ పుట ఆద్యంతం మీరు చక్కగా ఓ పెద్ద వీరోలా కనిపించారు.. కానీ ఆ చివ్వరలో ఒక్క ఉదుటున పాతాళంలో పడేశారు..

    ఇది ఏమాత్రం క్షమార్హం కాదు.

    రిప్లయితొలగించండి
  2. అజ్ఞాతజనవరి 15, 2009

    venkateswara rao.

    Excellent climax. If U really smoking stop immediatly.

    vvrao

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి