31, జనవరి 2011, సోమవారం

శాంతి స్వరూప్ గారికి పదవీవిరమణ శుభాకాంక్షలు!!










1974 లో దూరదర్శన్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమై దూరదర్శన్‌లో ఒక ఐకాన్‌గా నిలబడి న్యూస్ రీడర్‌గా, పరిచయకర్తగా దూరదర్శన్ ప్రెక్షకుల మనసుల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని పదిలపరచుకున్న శ్రీ శాంతి స్వరూప్ నరసింహం ఈ రొజు పదవీ విరమణ చేయనున్నారు. 36 సంవత్సారలు తెలుగు ప్రేక్షకులను అలరించిన శాంతి స్వరూప్ నిన్న దూరదర్శన్‌లో వార్తలను చదివి ప్రేక్షకులకు వీడ్కోలు పలికారు. పదవీ విరమణ చేస్తున్న శాంతిస్వరూప్ గారికి శుభాకాంక్షలు తెలియ చేస్తోంది సమీహ. పదవీ విరమణ చేసినా దూరదర్శన్ వారి సేవలను వినియోగించుకుంటే బాగుడును. భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఇవ్వలని కోరుకుంటూ..!

10 కామెంట్‌లు:

  1. అజ్ఞాతజనవరి 31, 2011

    ఎంతో మంది న్యుస్ రీడర్లు ఈ మధ్య కాలంలో వచ్చినా శాంతి స్వరూప్ గారు వార్తలను చదవటం లో తనదైన ముద్రను వేశారు. మేము ఏ దేశం లో ఉన్నా ఇప్పటికి ఆయన పేరు అలా గుర్తు ఉండిపోయింది. వారు చేసిన సేవలకు కృతజ్ఞతలు చెప్తూ... భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఇవ్వలని కోరుకుంటూ..!

    Sri Ram

    రిప్లయితొలగించండి
  2. ఈయనే ఒకసారి ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూలో చెప్పారు.

    ఒకసారి ఈయన చార్మినార్ ప్రాంతంలో ఏదో సందర్భంలో వెళ్ళినప్పుడు ఒక తెలుగంతగా తెలీని ముస్లిం మహిళ కనిపించి మాటలసందర్భంలో తనకు తెలిసిన తెలుగులో "రోజూ నిన్ను T.V. లో చూడాల్సి వచ్చేది బాబు" అని అన్నదట. ఈయన కొంచెం నొచ్చుకోని ఏం చేస్తామమ్మా "నాకు ఇలా మీకు అలా తప్పలేదు" అని అన్నారట. ఆవిడ "అయ్యో అదికాదు బాబు. "నాకు తెలుగు రాకపోయినా నువ్వు చదువుతుంటే ఎందుకో వినాలనిపించేది" అని అన్నదట. వీరిని, విజయదుర్గ గారిని మర్చిపోయే దూరదర్శన్ ప్రేక్షకులుండరేమో. ఒకొకాయన కూడా వార్తలు చదువుతుండేవారు పేరు K.L.N. రావు అనుకుంటాను. ఆయన్నప్పట్లో మేము Gaint Robot అని పిలిచేవాళ్ళం (ఆయన జుట్టు తీరు కొంచెం వింతగా వుండేది).

    రిప్లయితొలగించండి
  3. 1990 ముందు పుట్టి శాంతిస్వరూప్ తెలియని తెలుగువాడుండడేమో. ఈ మధ్యన వచ్చిన స్రవంతుల్లో ఇలాంటి గాంభీర్యం ఉన్నవారిని నేను చూడలేదు. ఆయనకు దేవుడు మేలు చెయ్యాలని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  4. వార్తలు చదివేవాళ్ళు, పరిచయకర్తలు, వ్యాఖ్యాతలు అనేక తెలుగు ఛానెళ్ళలో ఈ మధ్య ఉపయోగించే భాష, వారి ఉచ్ఛారణ విని ఈ మధ్యనే ఆనుకున్నాను "స్వచ్ఛమైన తెలుగు ని టీవీ లో మనం వినాలి అంటే అది మన శాంతి స్వరూప్ గారు మాత్రమే చదవాలి" అని.. అటువంటి స్వచ్ఛమైన మాట తీరు.. భాష.. హావభావాలు.. ఇటు సున్నితత్వం.. అటు గాంభీర్యం.. వెంటనే చిరు మందహాసం.. ఆహా ! ఈ శైలి ఆయన సొంతం.. ఇలాంటి ఒక చక్కని, పరిపూర్ణమైన మరొక టీవీ వ్యాఖ్యాతని మళ్లీ మనం చూడలేం, వినలేం అన్నది అక్షర సత్యం !! పదవీవిరమణ సందర్భంగా శాంతి స్వరూప్ గారికి శుభాకాంక్షలు..
    ఈ బ్లాగుని ఆయన చదవాలి.. ఆయన దూరదర్శన్ తెలుగుకి చేసిన సేవకి నిజమైన గుర్తింపు లభించిందని తెలుసుకోవాలి.. అనేది నా ఆకాంక్ష..

    రిప్లయితొలగించండి
  5. ఆయన నిజంగా శాంతిస్వరూపుడే.

    రిప్లయితొలగించండి
  6. శాంతి స్వరూప్ గారు ఏదైనా దుర్వార్త చదవాల్సి వస్తే ఏడుపు ముఖం పెట్టడం... మంచి వార్తలకు నవ్వు మొహం పెట్టడం ప్రతీసారీ ముందే గెస్ చేస్తూ నవ్వుకునే వాళ్ళం మా ఇంట్లో..

    రిప్లయితొలగించండి
  7. న్యూస్ రీడర్లంటే ఆయనలా ఉండాలి.ఈ దిక్కుమాలిన న్యూస్ చానల్సు తెలుసుకుంటే బావుణ్ణు.

    రిప్లయితొలగించండి
  8. శాంతి స్వరూప్ గారు ఒక మంచి న్యూస్ రీడరే కాదు మంచి తెలుగు భాషాభిమాని
    అయన ద్వారా ఎన్నో మంచి తెలుగు మాటలు నేర్చుకున్నా
    అయన విశ్రాంత జీవితం లో ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖం (శాంతి అయన పేరులోనే ఉంది ) కలుగు గాక

    రిప్లయితొలగించండి
  9. అచ్చమైన, స్వచ్ఛమైన, తెలుగుతనానికి ప్రతీకలా
    ఒక వ్యక్తి మా చిన్నప్పుడు దూరదర్శన్ లో వార్తలు చదివేవారు,వారి పదవీవిరమణ సందర్భంగా శుభ కాంక్షలు తెలియ జేసు కుంటూ,వారి భావి జీవితం మరింత ఆహ్లాదంగా సాగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను...సతిశకోయిలదా

    రిప్లయితొలగించండి
  10. mee telugu blog bavundi.
    కోనసీమ సోయగాల్ని రొమాంటిక్ గా చిత్రీకరించిన సాంగ్
    ప్రతి ఉదయం నీ పిలుపే
    హృదయంనే కదిలించే
    మనసే పులకించే
    Prati Udayam Nee Pilupe - Romantic Melody Song from Prema Entha Madhuram
    Song Link: https://youtu.be/Z9qVLatW6dQ

    రిప్లయితొలగించండి