16, మే 2009, శనివారం

రాజశేఖరుని పాచిక పారింది

జరిగిన ఎన్నికలలో ప్రతీ పార్టీ తెలంగాణా అంశంనుండి లబ్ది పొందాలనే చూసాయి. కర్ర విరగకుండా పాము చావకుండా తమపని కానిచ్చేయాలని అటు (టీఅరెస్‌తో చేరి) తెలుగు దేశం పార్టీ, ప్రత్యేక తెలంగాణా కోసమే జన్మించిన టీఆరెస్, విభజనకు(మధ్యస్తంగా) సరేనంటూ పీఅర్పి కుడా వంత పాడాయి. కాని ఎన్నికలఫలితాల సరళిని చూస్తే తెలంగాణ సమస్య ప్రజల సమస్య కాదని ఇది కేవలం ఒక రాజకీయ సమస్య మాత్రెమే అనిపిస్తొంది. మొదటినుండి తెలంగాణ విభజనకు సశామీరా అన్నది ఒక్క రాజశెఖర రెడ్డి మాత్రమే. అవినీతి పెరిగిపోయిందని ప్రజలలో ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలోకి మార్చుకుందామని ప్రయితించిన చంద్ర బాబుకు ఒక్క విషయంలో ఎదురు దెబ్బ తగిలింది. అదే తెలంగాణా అంశం. ప్రజలో వైయసార్ పట్ల కొంత వ్యతిరేకత ఉన్నా తెలంగాణా అంశం విషయంలో ఆయన (చంద్ర బాబు) అంచనాలు తారుమారయ్యాయి. టీఆరెస్‌తో పొత్తే ఇప్పుడు ఆయన కొంప ముంచింది.రాష్ట్రంలో తొలి విడత ఎన్నికలు అయ్యాక టీఆరెస్ ను కొంత దూరం పెట్టి ఉత్తరాంధ్రలో పర్యటించారు. వాగ్దానాలు గుప్పించారు. కానీ ప్రజలు ఆయన మాటలు నమ్మేరొ లేదో గానీ రాజసేఖర రెడ్డి మాత్రం గోదావరి జిల్లాలలో పర్యటిస్తూ ఒకే మాట అన్నారు. సమైఖ్య ఆంధ్ర కావాలెంటే కాంగ్రెస్‌కు ఓటు వేయండని. లేకపోతే హైదరాబాదులో విదేశీయుల్లాగ జీవించాలని. హైదరాబాదులో కాలు పెట్టే అవకాశం ఇకముందు అక్కడివారికి ఉండదని. ఆ అంశాన్ని స్పష్టం చెయడంవల్ల ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ కు అనుకున్నదాని కన్నా ఎక్కువ సీట్లు వచ్చాయి. పీఆర్పీకి స్థానం లేకుండా చేశాయి. తెలుగుదేశం పార్టీని కోలుకోలేని దెబ్బ తీసింది. ఆ విషయంపై కాంగ్రెస్ లో మిగిలిన తెలంగాణా పెద్దలు గొల్లుమన్నారు. పార్టీ పూర్తిగా బ్రష్టు పడుతుందని డిల్లీ పెద్దలకు వార్నింగులు ఇచ్చారు. అలా తెలంగాణాను వెనకేసుకొచ్చిన పెద్దలు కూడా ఈ ఎన్నికలలో ఓడిపోవడం చూస్తే తెలంగాణా అనేది ప్రజా సమస్య కాదనే విషయం మరింత బలపడుతోంది. ప్రస్తుతం ఈ వ్యాసం వ్రాసే సమయానికి టీఅరెస్ అధినాయకుడు పురిటి నొప్పులు పడుతున్నారు. ఆయన నెగ్గుతారో లేదో కూడ తెలియని పరిస్తితి. ఇక పీఅర్పీ పరిస్తితి చెప్పనక్కర్లేదు. చిరంజీవి పాలకొల్లులో ఓడిపోవటం కూడా దీనిని బలపరుస్తొంది. కాబట్టి "రాజశేఖరా నీపై మోజుతీరలేదురా " అని మరో ఐదేళ్ళు పాడుకోవడమే.

12 కామెంట్‌లు:

  1. మీ విశ్లేషణ చాల వరకు వాస్తవానికి దగ్గరగావుంది.
    మీ టపాకి పెట్టిన శీర్షిక కూడా సముచితంగా వుంది.

    తెలంగాణా ఎన్నికలు అయ్యేంత వరకూ తెలంగాణా అంశం మీద గుంభనం గా వుంటూ, ఒకసారి సోనియా గాంధీ గారితో ఇప్పటికీ తెలంగాణా మా పార్టీలో ప్రాదాన్యతాంశంగా వుంది అని కూడా అనిపించి
    తెలంగాణా లో ఎన్నికలు అయిపోయిన మరుక్షణమే
    తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు తానూ, తన పార్టీ బద్ధ వ్యతిరేకం అనే అసలు రూపాన్ని ప్రదర్శించారు శ్రీమాన్ వై ఎస్ గారు.

    అదే రూపాన్ని తెలంగాణా లో లీలామత్రంగానైనా కనపడకుండా రోశయ్య కమిట్టే చాటును దాచిపెట్టారు.

    తెలంగాణా వస్తే మీ బతుకులు విదేశీయుల్లా అవుతాయి అందమే కాకుండా పులిచింతల, పోతిరెడ్డిపాడు, వగైరా ప్రాజెక్టులన్నీ ఆగిపోతాయి, మీ పొలాలకు నీళ్ళు రావు అంటూ జనాన్ని ముఖ్యంగా రైతులను హడలగొట్టారు.

    అంతే మీరన్నట్టు పాచిక పారింది

    రైతులంతా పొలోమంటూ చిరంజీవి మొఖం కూడా చూడకుండా ఈస్ట్ వెస్ట్ అంతటా కాంగ్రెస్స్ పార్టీకి గుద్దేశారు.

    ఈ విషయం పక్కన పెడితే -
    ఒక్కసారి 2004 ఎన్నికల చిత్రాన్ని గుర్తుచేసుకోండి.
    అప్పుడు తెలుగు దేశం సమైక్య వాడ జండాను పట్టుకుని తిరిగింది.
    ఇదే కాంగ్రెస్స్ టి ఆర్ ఎస్ తో కలిసి తెలంగాణా ప్రత్యెక రాష్ట్రానికి అనుకూలంగా ఎన్నికల్లో పోటి చేసింది.
    మరి అప్పుడు కూడా కాంగ్రెస్స్ గెలిచింది. ఆ తరవాతే తెలంగాణా వాదాన్ని ఎడమకాలితో తన్నింది.

    తెలంగాణా లో ఒక్క సి పి ఎం తప్ప అన్ని దగుల్భాజీ పార్టీలూ తెలంగాణా వాదానికి జైకోడుతూనే పోటి చేసాయి అని గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక్కడూ సమైక్య వాదం మాట ఎత్తలేదు. అందరూ దొంగ కబుర్లే చెప్పి ఇక్కడి ప్రజలను మోసం చేసారు.

    ఇప్పుడేమో తెలంగాణా వాదం ఒక్క టి ఆర్ ఎస్ ఒక్కటే ఎత్తుకున్నట్టు దానికి తగినన్ని సీట్లు రాలేదు కాబట్టి తెలంగాణా వాదం ప్రజల్లో లేదు అనడం ఎంత దగాకోరు తనం !!!!

    తెలంగాణా ఎన్నికలు అయిపోయిన తరవాత అన్న మాటలను
    తెలంగాణా లో ఎన్నికల ముందు నుంచే అని వుంటే, కాంగ్రెస్స్ విధానం సమైక్యవాడమే అని చాటి వుంటే ... తెలంగాణపై
    పార్లమెంటులో అబ్దుల్ కలం చేత చెప్పించింది, మన్మోహన్ చేత చెప్పించింది
    ప్రణబ్ ముఖర్జీ కమిటీ రోశయ్య కమిటీ లు వేసిందీ అన్నీ ద్రామాలే అని నిజాయితీగా ప్రకటించి వుంటే
    తెలంగాణా ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలిసేది.

    ఇప్పటికైనా ఈ డొంక తిరుగుడు లేకుండా తెలంగాణా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే నిజాయితీ ఎవరికైనా వుందా? ఎంతకాలం ఈ వంచన?

    టి ఆర్ ఎస్ కి పడ్డవే ప్రత్యెక తెలంగాణా కోరుకునే వాళ్ళ వోట్లు మిగతా వాళ్ళ వేమొ సమైక్య ఆంధ్ర వోట్ల ? ఎంత దుర్మార్గమైన కుట్ర వుంది ఈ విశ్లేషణలో ?
    ఏది సమైక్యవాద పార్టీ. ? అట్లా ప్రకటించిన పార్టీని చూపించండి
    సిపిఎం కూడా మేము అడ్డుకో బోము అంటూ నంగి కబుర్లు చెప్పలేదూ?????

    రాజకీయమా నీ పీరు అబద్ధమా , వెన్నుపోటా, నయవంచానా కాస్త చెప్పమ్మా !!!

    రిప్లయితొలగించండి
  2. కేసీయార్‌తో పెట్టుకుని చంద్రబాబు ప్రతిసారీ దెబ్బతింటున్నాడ - అప్పుడు గొడవ పెట్టుకుని, ఇప్పుడు పొత్తు పెట్టుకుని. తెలంగాణవాదం ప్రజల్లో అప్పుడూ లేదు, ఇప్పుడూ లేదు. ఉందల్లా రాజకీయనాయకుల్లోనే. ఈ దెబ్బతోనన్నా తెలంగాణ దెయ్యం వదిలి సమైక్యవాదం బలపడుతుందేమో చూడాలి.

    రిప్లయితొలగించండి
  3. తెలంగాణా వాదం అప్పుడూ వుంది.!
    ఇప్పుడూ వుంది.!!
    ఎప్పుడూ వుంటుంది.!!!

    తెలంగాణా నీళ్ళని, వనరులని, నేలనీ దోచుకునే వాళ్ళలో ... వాళ్ళ మోచేతి నీళ్ళు తాగే వాళ్ళలో ...తప్ప సమైక్యవాదం ఎక్కడా లేదు. ఎప్పుడూ లేదు.

    2004 లో చంద్రబాబు ధైర్యంగా మేము సమైక్య వాదులమని ఎన్నికల్లో పోటి చేసాడు.! ఓడిపోయాడు!!
    ఆపనిని అప్పుడే కాదు ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి నిజాయితీగా చేయలేక పోయాడు. ! బతికిపోయాడు !!!

    ప్రత్యేక తెలంగాణా కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుందంటూ ...తెలంగాణా లోని కాంగ్రెస్స్ వాదులతో దొంగ మాటలు చెప్పించింది కాంగ్రెస్స్ పార్టీ.
    నేరుగా సమైక్య వాదమే కాగ్రేస్స్ విధానమని గుండెమీద చేయి వేసుకుని చెప్పలేక పోయింది.

    ఇవన్నీ తెలిసి కూడా, ఆ రాజకీయ కుతంత్రాలకు ఎందుకు జై కొడతావు మిత్రమా??
    నిజాయితీగా ఆలోచించు!!

    అబ్రక దబ్ర అబ్రక దబ్ర అంటే తెలంగాణా వాదం కనుమరుగు కాదు!!

    మూడు కోట్ల ప్రజల ఆకాంక్షని, ఆవేదనని, వారికి జరుగుతున్న అన్యాయాన్నీ గుర్తిచు.
    ఏం సాధించదానికని ఈ ఆత్మవంచన , పర వంచన ???

    రిప్లయితొలగించండి
  4. అజ్ఞాతమే 16, 2009

    చిరంజీవి పాలకొల్లులో ఓడిపోవటం నాకు మరో రకంగా కూడా మంచిదనిపించింది. రెండు స్థానాల్లో గెలిచి ఉంటే, ఒక దానికి రాజీనామా చేసి, మళ్ళీ ఎన్నికలనేవారు ప్రజల డబ్బుల్తో...

    -యువ

    రిప్లయితొలగించండి
  5. అబ్రకదబ్ర,
    నేను ఈ ఎల్క్షన్స్ ని ఫాలో అవ్వలేదు, అవ్వను కూడా. అయితే మీరిక్కడ రాసింది చాలా నిజం. నేను తెలంగాణా బిడ్డనయినా, నేను ప్రతి క్షణం వ్యతిరేకించా ప్రత్యేక తెలంగాణాని, నాకు చంద్రబాబు అంటే ఉన్న కాస్తో, కూస్తోఅ ఉన్న అభిమానం, ఆయన టి ఆర్ ఎస్ తో కలిసినప్పుడు పూర్తిగా పోయింది.
    నాకీ కాంగ్రెస్ అవినీతి, మత రాజకీయాలు అంటే ఎలర్జీ అయినా, వై ఎస్ ఆర్ కి నేను క్రెడిట్ ఇచ్చేది రెండు విషయాల్లో, 1) నక్సల్స్ ని తరిమి తరిమి మరీ కొట్టాడు, సైలెంట్ గా 2) ఎల్లప్పుడూ తెలంగాణాని వ్యతిరేకించాడు, ఒక్క సారి కూడా ఆయన దానికి సానుకూలంగా కనిపించలేదు.

    డిస్క్లెయిమర్: నేను ఏ పార్టీ అభిమానిని కాదు, నా మీద దాడి చేయొద్దు, నాకీ ఎలక్షన్స్ గురించి ఓనమాలు కూడా తెలీవు.

    రిప్లయితొలగించండి
  6. అబ్రకదబ్ర గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. తెలంగాణ ఎక్కువగా వుంది రాజకీయనాయకుల మనస్సులలోనే. నేను కూడా సమైక్యవాదం బలపడుతుందని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  7. తెలంగాణా ప్రజల్ని అర్థం చేసుకోవడంలో రాజకీయ నాయకులు విఫలం చెందినంతమాత్రానా, వారికి ప్రతికూలంగా తెలంగాణా ప్రజలు తీర్పు చెప్పినంత మాత్రానా ‘తెలంగాణా ఒక అస్తిత్వవాద సమస్య కాదు’ అనుకోవడం సరైన విషయం కాదు.

    తెలంగాణాకు బహుశా రాజకీయ పరిష్కారం సరైంది కాదనుకుంటాను. అదీగాక కేసీఆర్ లాంటి తలతిక్క నాయకుడి పాలబడ్డంకూడా ఈ దుస్థితికి కారణం.

    రిప్లయితొలగించండి
  8. కోస్తా ఆంధ్రలో లోక్ సత్తా కూడా కమ్మవాళ్ళకి ఎక్కువ టికెట్లు ఇచ్చింది. లోక్ సత్తా గెలవలేదు కానీ కొన్ని చోట్ల కాంగ్రెస్ కి నష్టం వచ్చింది. కమ్మవాళ్ళ జనాభా చాలా తక్కువగా ఉన్న శ్రీకాకుళం, విజయనగం జిల్లాలలో మాత్రం కాంగ్రెస్ గతం కంటే బలపడింది. ప్రజాస్వామ్యం పేరు చెప్పి కుల రాజకీయాలు నడిపే లోక్ సత్తాకి జనం ఎప్పటికైనా బుద్ధి చెపుతారు. లోక్ సత్తా అభ్యర్థులలో దాదాపుగా ఎవరూ గెలవకపోయినా దక్షిణ కోస్తా, హైదరాబాద్ లలో మాత్రం కమ్మవాళ్ళని ప్రభావితం చెయ్యగలిగింది. లోక్ సత్తా తెలుగు దేశం అనుకూల పార్టీ అని చెపితే ఇక్కడ ఒక బ్లాగర్ నమ్మలేదు. నిన్న TV9లో నన్నపనేని రాజకుమారి లోక్ సత్తా పై సానుభూతి చూపుతూ చేసిన ప్రకటనలు చూసినా అతనికి నిజం అర్థమయ్యేదేమో. తెలుగు దేశం, లోక్ సత్తా పార్టీలు ఓడిపోయినందుకు నాకు సంతోషంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  9. అబ్రకదబ్ర .."తెలంగాణవాదం ప్రజల్లో అప్పుడూ లేదు, ఇప్పుడూ లేదు." చాలా పొరబడ్డారు.

    రిప్లయితొలగించండి
  10. ప్రజామోదం ఉన్న ఏ ఉద్యమమైనా తప్పక విజయం సాధిస్తుంది. తెలంగాణా ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని కొంతమంది ప్రత్యేక తెలంగాణా కోరుతూండవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజల నిర్నయమే శిరోధార్యం. ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారంగా పేరుపొందిన పశ్చిమ గోదావరి జిల్లాలోకూడా ఇప్పటికి మంచినీరు కూడా దొరకని ప్రాంతాలు అనేకం ఉన్నాయి. తెలంగాణా అభివృద్ధికి నోచుకోవట్లేదని నెత్తి నోరు కొట్టుకొనే నేతలు ఎమెల్యేలు ఎంపీలుగా ఉన్నప్పుడు ఎంతమేరకు కృషి చేశారో వారే చెప్పాలి. కనీసం ఏంపి లాడ్స్ నిధులు ఏవిధంగా ఖర్చు చేశారో చెప్పాలి. ఎంతసేపూ వారి దృష్టి అధికారంపైనే ఉండేది. తెలంగాణా అభివృద్ధిని నిజంగా కాంక్షించే పెద్దలెవరూ కూడా టీఆరెస్ ను సక్రమమార్గంలో ఉంచే ప్రయత్నం చేయలేదు.



    @ ప్రతాప్ గారు "విశ్లేషణ దగాకోరుతనం" అన్నారు. ఏది దగాకోరుతనం? వెనుకటికెవరో ఇద్దరు అన్నదమ్ములు ఆస్తి పంపకాలలో ఒక పాడి ఆవు విషయం వచ్చేసరికి అన్నగారు తమ్ముడికి ముందు భాగం నీది, వెనుక భాగం నాది అన్నాడుట. కోట్లాది రూపాయిలు రాష్ట్రం మొత్తం మీద పన్నుల రూపంగా వసూలు చేసి హైదరాబాదును వృద్ధి చేశారు. ఇప్పుడు నేను ఒక్కడినే అనుభవిస్తా అనడం సమంజసమా?

    పెద్దవాడయ్యేదాకా కని పెంచిన తల్లే నీకు నాకు సంభంధం లేదని ఆ తల్లే బిడ్డని తోసేస్తే ఆ బిడ్డ పరిస్తితి ఎలా ఉంటుందో మీకు తెలియదా? ఎందరో ప్రజలు ఎన్నో ఏళ్ళ క్రితం వచ్చి ఇక్కడ స్తిరపడ్డారు. ఇప్పుడు వాళ్లందరిని పరుగుపెట్టిస్తా, ఖాళీ చేయిస్తా అనడం ఎంతవరకూ సబబు? మీరన్నది నిజం - ప్రజల మనోభావాల్ని అర్ధం చేసుకోవాలి. బహుశా ఈ కారణాలవల్లే తెలంగాణా అంశం ఎక్కువమంది ప్రజల మనసుల్లో లేదు.

    రిప్లయితొలగించండి
  11. తెలంగాణావాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చరిత్ర ఉన్న తెలుగు దేశంతో పొత్తు పెట్టుకుంటే టి.ఆర్.ఎస్.ని తెలంగాణావాదులు నమ్మరు. తెలంగాణా వ్యతిరేకులు మాత్రమే నమ్ముతారు. అందుకే తెలంగాణాలో టి.ఆర్.ఎస్. ఓడిపోయింది. తెలంగాణావాదం లేదు అనడం హాస్యాస్పదం.

    రిప్లయితొలగించండి
  12. telangana ekkadavundi? neenu hyderabadini, na peddavadina telangana, nachinnavadina andhra, andukenenu antanu nenu teluguammayini - andhra ayina telangana ayina, rayalaseema ayina naakutumbamloni bhagale.

    రిప్లయితొలగించండి