15, మే 2009, శుక్రవారం

జ్యొతిష్య శాస్త్రంపై హేతువాదుల చాలెంజ్

ఈ ఎన్నికలలో ఏ పార్టీ విజేత అవుతుండో చెప్పగలరా అని కలకత్తాలో హేతువాదులు జ్యొతిష్యులను చాలెంజ్ చెసారట. జాతకాలనేవి వ్యక్తులకు ఉంటాయిగానీ పార్టీలకు కాదు. ఈరోజు టీవీలలో కనిపించే జాతక బ్రహ్మ్మలు విషయ పరిజ్గ్యానంకన్న డబ్బు సంపాదనలో పరిజ్గ్యానం ఉన్నవారే ఎక్కువ. నిజమైన పరిజ్గ్యానం ఉన్న వ్యక్తులు వారిచ్చే డబ్బులకు జాతకాలు చెప్పరు. వీరు చేసే బోడి చాలెంజ్‌లకు సరే అనరు. మా వూరిలో (అనగానే కహానీ అనుకోకండి) ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన జీవనం మావూరి సత్రంలోనే. ఆయనను అందరూ సత్రవు వెంకన్న గారూ అనేవారు. ఆయన దగ్గరకు వెళ్ళిన వ్యక్తి ఆయనకి సమస్య చెప్పనవసరం లేదు. జ్యొతిష్య శాస్త్రం ప్రకారం వచ్చిన వారు ఎవరిగురించి ఏ సమస్యతో వచ్చరో చెప్పి ఆయనే మనం ఎదుర్కొంటున్న సమస్యకి ఎప్పుడు పరిష్కారం అవుతుందో చెప్పేవాడు. ఆయనకి వొంటిమీద చిన్న అంగవస్త్రం తప్ప మరేమి కట్టుకోవడానికి కుడా ఉండేది కాదు. సత్రవులో కుటుంబంతో జీవనం. ఆయనదగ్గరకు వెళ్ళినవళ్ళు రూపాయో రెండో ఇస్తే దానితోనె జీవించేవాడు. సరస్వతి కటాక్షం ఉందిగాని లక్ష్మీ కటాక్షం లేదని ఊరిలో అందరూ అనుకొనేవారు. ఇలాంటి విషయాలలో వితండ వాదం చెసేవారిని సమాధాన పరచలేము. జ్యొతిష్యం నిజమైన శాస్త్రం. ఎటొచ్చిదానిలో పూర్తి విషయజ్గ్యానం ఉన్నవాళ్ళు లేరు (తక్కువ). గాలి కంటికి కనిపించదని గాలి లేదని అనడం లాంటిదే జ్యొతిష్య శాస్త్రం కూడ అబద్ధం అనడం. ఇదికూడా హేతువాదులు వారి పబ్లిసిటీకోసం చెసే ఒక తంతు. ఎవరు గెలుస్తారోనని వారి సందేహం తీర్చుకోవాడానికి కుడా కావచ్చు. :)


30 కామెంట్‌లు:

  1. వెదర్ చానెల్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి రేపు కరెక్టుగా ఎన్ని డిగ్రీలు ఉంటుందో చెప్పాలి, లేకపోతే దుకాణం ముయ్యాలి అని వాదించడం మొదలుపెడితే, మెడలు పట్టి గెంటేస్తారు.

    జ్యోతిష్య శాస్త్రం కూడా అంతే!

    పాపం హేతువాదులకు శాస్త్రం అంటే ఇంకా అర్థం కాలేదు.

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. Where were these idiots when Mother Teresa claimed that she cured cancer just by her touch and was then awarded Sainthood? What was the prize announced for proving her wrong/right?

    రిప్లయితొలగించండి
  4. భూమి నీడ చంద్రుని మీద పడడం వల్లే గ్రహణాలు కనిపిస్తాయన్న నిజం జ్యోతిష్కులు నమ్మరు. పాములు(రాహుకేతువులు) వల్లే గ్రహణాలు వస్తాయని నమ్ముతారు. పాములు గ్రహాల రూపంలో ఉండడం ఏమిటి? అవి మింగడమేమిటి? Isn't it nonscience?

    రిప్లయితొలగించండి
  5. It depends on what you interpret .. If you examine it carefully Rahu and Ketu are two positions related to the eclipse based on the umbra and the penumbra.

    By the way wasn't Mother Teresa's micracle Nonsense? Did these idiots do anything about it?

    రిప్లయితొలగించండి
  6. రాహుకేతువులు పాములేనని జ్యోతిష పుస్తకాలలోనే వ్రాసి ఉంది. ఇంత నాన్ సైన్స్ నమ్మకాలు నమ్ముతూ ఇతరులు పంగనామాలు పెట్టుకున్నారకుని umbra & penumbraతో పొంతన లేని పోలికలు పెట్టకు.

    రిప్లయితొలగించండి
  7. ఎన్నికల అన౦తర సర్వేలు అబద్దమైతే ఈ హేతువాదులు వార్తా చానళ్ళను మూసివేయాలని డిమా౦డ్ చేయగలరా? వీరి అస౦బద్ద వాదనలకు హేతువేది. నిజమైన ఙ్ఞానులు అమ్ముడుపోరని తెలియని అమాయకులా వీరు? తమ ఉనికిని కాపాడుకోవటానికి ఇటువ౦టి అల్పమైన పోటీలను నిర్వహి౦చట౦ తోనే వీరి నిబద్దత బయటపడి౦ది. వీరిపై వీరికి నమ్మక౦ లేకే అస౦బద్దమైన ప్రశ్నలను స౦ధి౦చారు.

    అసలు సిసలు జ్యోతిష్య ప౦డితులు ఈ ప్రశ్నలకైనా సమాధాన౦ చెప్పగలరేమో గాని, మన దేశ౦లో ప౦డితులకు, అదీ స్వదేశీ ప౦డితులకు, శాస్త్రాలకూ విలువెక్కడిది? శల్యుని వారసులైన మనకు ఎ౦తటి ప్రతిభా వ౦తులనైనా కి౦చపరచి మట్టికరిపి౦చట౦ ఉగ్గుపాలతో నేర్చిన విద్య. దానితో మన ప్రతిభను/ప౦డితులను మనమెప్పుడో భూస్తాపిత౦ చేసేశా౦.

    ఇక ఇప్పటికి బజారు జ్యోతిష్యులతో ఈ శాస్త్ర౦ తప్పని నిరూపి౦చట౦ పెద్ద కష్టమే౦ కాదు.

    రిప్లయితొలగించండి
  8. భౌతికత ఆధారంగా వేసే అంచనాలకి, అభౌతికత ఆధారంగా వేసే అంచనాలతో పోలిక పెట్టడం ఏమిటి? జ్యోతిష్యంలో భౌతిక వాస్తవికత లేదు. జ్యోతిష్యులు చెప్పే ఫలితాలు తప్పు కావడంలో విచిత్రం ఏమీ ఉండదు. టి.వి. చానెల్ సర్వీ తప్పైతే అది సర్వేలో లోపం అవుతుంది కానీ భౌతిక వాస్తవికతలో లోపం అవ్వదు. జ్యోతిష్యానికి భౌతిక వాస్తవిక పునాదులు (materialistic realistic foundations) ఉన్నాయని ఎవడూ నిరూపించలేడు. ఈ చాలెంజ్ లో నేను ఓడిపోతే సన్నాసుల ఆశ్రమంలో చేరిపోతాను.

    రిప్లయితొలగించండి
  9. @ ప్రవీణ్ గారు : మీరు విషయాన్ని గ్రహించినా తప్పుగా అర్ధం చేసుకున్నారు. గ్రహ గతులగురించి గ్రహణాలగురిన్చి, గ్రహణం ఎప్పుడు ఎలా ఏర్పడుతుంది ఎంతసేఅపు ఉంటుంది అనేది మన పూర్వికులు ఎలాంటి పరికరాలు లేని రోజుల్లో లెక్కలుగట్టి చెప్పేవారు. ఇక దానిని పాము కోతి అనడం వెనుక కుడా కొన్ని నిబద్ధ కారణాలున్నాయి. మీకు కొంత పరిచయం ఉందిగాబ్బట్టి మరింత లోతుగా చదవండి. మీకే అర్ధం అవుతుంది.

    రిప్లయితొలగించండి
  10. నీడకి పాము, కోతి లాంటి పేర్లు పెట్టాల్సిన అవసరం ఉందా? యాపిల్ పండుని అరటి పండు అని అనాల్సిన అవసరమున్నట్టు?

    రిప్లయితొలగించండి
  11. గ్రహణాలు ప్రతి ఏడాది వస్తాయి. ఒకసారి సంపూర్ణ గ్రహణం చూసిన తరువాత సంపూర్ణ గ్రహణం ఎంత సేపు కనిపిస్తుందో గుర్తు పెట్టుకోవడం కష్టం కాదు. రెండు గ్రహణాల మధ్య ఇంటర్వెల్ పీరియడ్ లెక్కపెట్టిన తరువాత ఎన్ని రోజులకొకసారి గ్రహణాలు వస్తాయో చెప్పడం కష్టం కాదు.

    రిప్లయితొలగించండి
  12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  13. - E= mc**2 + k. తెలుసా మీకు. అ౦దులోని K లా౦టిదే ఈ రాహువు, కేతువు. మన(వారి) అ౦చనాలక౦దని అనేక గ్రహాలే కాకు౦డా మరిన్ని అటువ౦టి భౌతిక/అభౌతిక మూలకాల ప్రభావాన్ని రాహువు, కేతువులుగా స౦గ్రహి౦చారు. ఆ కాల౦ లోనే మన వారు అ౦తటి ప్రావీణ్యాన్ని ప్రదర్శి౦చారు. సామాన్య మానవుల సౌలబ్య౦ కోస౦ వాటిని గ్రహాలుగా, పాములుగా చిత్రీకరిస్తే వాటిని పట్టుకుని ఆ శాస్త్రమే తప్పనట౦ భావ్య౦గా లేదు.

    ప్రస్తుత రూప౦లోని జ్యోతిష్య శాస్త్రం బతుకు తెరువుకోస౦ రూపా౦తర౦ చె౦దినా, అ౦దులోని శాస్త్రీయతను గుర్తి౦చ౦డి. బతుకు తెరువు కోస౦ మిడిమిడి ఙ్ఞాన౦తో జ్యోతిష్య౦ చెప్పే వాళ్ళనే బజారు జ్యోతిష్యులన్నానే తప్ప మరో ఉద్దేశ్య౦ లేదు.

    రిప్లయితొలగించండి
  14. అజ్ఞాతమే 15, 2009

    నేను కూడా ఒకప్పుడు మా లోకం బ్లొగ్ వారి లాగా వీటిని వ్యతిరేకించేవాడిని, కాని మీరు చెప్పిన సత్రపు వెంకన్నా వారి లా ఇద్దరిని నా కళ్ళ తో చూసాను . అప్పటి నుంచి వ్యతిరేకించటం మానుకున్నాను. మా లోకం గారు వ్యతిరేకించటం వ్యాపార పబ్లిసిటి లో అదొక భాగం. దానికి చాంతాడంత చరిత్ర ఉంది. కొంతమంది కి ఒక అగ్రవర్ణం మీద కల ద్వేషానికి సిద్దంతాం ముసుగు లో వారు గొప్పగా వ్యతిరేకిస్తారు.
    ఆ బ్లాగులో ఒకసారి తెలుగు గురించి పెద్ద వ్యాసం రాసి తెలుగు భాష అభివృద్ది చెందక పోవటానికికి చాందస వాదులు కారణం అని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.
    గత పది సం|| రాలుగా మాములు వాడుక భాష తెలుగు ని ఖూని చేస్తు (రెండు తెలుగు మాటలకి రెండూ ఇంగ్లిష్ మాటలు ఉచితం ) మీడియాలో మాట్లడు తున్నారు దానిని ఎవ్వరు పటించుకున్న పాపాన పోలేదు. తెలుగు భాష చాందసుల ఆధినం లో ఉండటం వలన సాంకేతిక పదాలు(వ్యవసాయము,సైన్స్ మొ|| ) తెలుగులో ప్రవేశపెట్ట లేక పొయారాని వారు వాపొయారు. మీరు గమనిచండి ఇప్పటి సినెమాల లో ప్రేమించాను, ప్రేమ, ఆనందము అనే సాధారాణ తెలుగు పదాలే వాడటం పొయింది. నువ్వు హ్యాపిగా ఫీల్ అయ్యావా ,లవ్ లో పడ్డావ.. ఇలాంటి పదాలు వాడు తున్నారు. ఇక టి.వి, రేడియొల సంగతి ఎంత తక్కువ చెపితే అంత మంచిది. వారికి టి.వి.9, ఒక ప్రముఖ తెలుగు పత్రికాధిపతులతో మంచి పరిచయాలు ఉన్నయి. వారే పూనుకొని కనీసం టి.వి. లో మాట్లాడె భాషను మెరుగు పరచ వచ్చుకదా? నేరాలు ఘోరాలు లాంటి అశాస్ర్తియ పొగ్రాములు రాకుండా చూడవచ్చు కదా? అవేవి జరిగే పని కాదు. ఈ మధ్య కాలం లొ అన్ని రకాల ప్రజా ఉద్యమాలు బలహీన పడి పొయాయి. రంగం లోకి దిగి ప్రజలకి ఎమైనా మంచి చేయాలీ అంటె ఖర్చులను ఈ మధ్య రాజకీయ పార్టీలు పెంచేశారు. బ్లాగడమైతే తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటి. వారు తామేదొ ప్రజలకు సేవ అచేస్తున్నామను కుంటారు, మనము వారి వ్యాసాలు చదివి ఒక ఇంచ కూడా మారము. ఆయన రాసే వ్యాసాలు చేతబడులు, నిమ్మకాయ లొనుంచి ఎర్రని ద్రవం రావటం మొద|| వాటి వలన మోసపొయే జనాలు ఈయన బ్లాగ్లు చదివి నిజాలు తెలుసుకుంటారా? అంత కంపుటర్ జ్ఞానమున్న వాడికి ఇవి మోసమని మన మార్థాండకు తెలిసినత కూడా తెలియదని వీరి ఉద్దెశమా? అందువలన వారు ప్రకటించే వాటిని చూసి నవ్వు కోవటం తప్ప మనము వారు కలసి చేయగలిగినది ఎమీ లేదు. "నవ్వు కోవటం తప్ప". :-)

    రిప్లయితొలగించండి
  15. గ్రహాలని పాములుగా చిత్రీకరిస్తే జనానికి భౌతికవాదం అర్థమవుతుంది అనడం కుందేలుకి మూడు కాళ్ళు ఉంటాయని చెపితే పిల్లలకి అర్థమవుతుంది అన్నట్టు ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  16. పెదరాయ్డు వ్రాసారు >>>ప్రస్తుత రూప౦లోని జ్యోతిష్య శాస్త్రం బతుకు తెరువుకోస౦ రూపా౦తర౦ చె౦దినా, అ౦దులోని శాస్త్రీయతను గుర్తి౦చ౦డి. బతుకు తెరువు కోస౦ మిడిమిడి ఙ్ఞాన౦తో జ్యోతిష్య౦ చెప్పే వాళ్ళనే బజారు జ్యోతిష్యులన్నానే తప్ప మరో ఉద్దేశ్య౦ లేదు.>>>
    జ్యోతిషం విద్య కనిపెట్టినవాళ్ళు వ్రాసిన ఒరిజినల్ రైటింగ్స్ మీకు తెలిస్తే ఒక వెబ్ సైట్ తయారు చేసి పెట్టండి.

    రిప్లయితొలగించండి
  17. మీ వెబ్ సైట్ చదివి మీ సేకరణల మీద కూడా పరిశోధన చేస్తాను.

    రిప్లయితొలగించండి
  18. అజ్ఞాతమే 15, 2009

    @Praveen,
    You first get a good jo and marry. Later you will do all R&D on these web sites.

    రిప్లయితొలగించండి
  19. నాకు ఆల్రెడీ బిజినెస్ ఉంది. పెళ్ళే ఇంకా అవ్వలేదు.

    రిప్లయితొలగించండి
  20. @ ప్రవీణ్ గారు: జ్యొతిష శాస్త్రంలొ ఉద్దండులైన వాళ్ళూ మీకు తారసపడకపోవడంవల్ల మీరు నమ్మలేక పోతున్నారు. అది కూడా సైన్సే. హిందూ పురాణాలలొ చెప్పబడిన ప్రతి విషయం వెనుక అంతర్లీనంగా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది.అవి అర్ధంగావడానికి కొన్ని వందల సంవత్సారలు పడుతోంది. మనిద్దరిదీ మిడి మిడి జ్గ్యానమే. నేను అవునన్నా మీరు కాదన్నా ఒరిగేదేమి ఉండదు.

    రిప్లయితొలగించండి
  21. భౌతికవాద శాస్త్రాలైతే అర్థమవుతాయి కానీ భావవాద శాస్త్రాలు ఏమి అర్థమవుతాయి?

    రిప్లయితొలగించండి
  22. ప్రవీణ్ గారూ గ్రహాలు భావవాదం కాదు. భౌతికమే. వాటి ప్రభావం మనిషిమీద ఉంటుందని శాస్త్రవేత్తలే ఒప్పుకున్నారు. మీరూ ఒప్పుకొని తీరాలి.

    రిప్లయితొలగించండి
  23. గ్రహాల ప్రభావం భూమి మీద పడే అవకాశాలే చాలా తక్కువ. ఇక మనుషుల నిత్య జీవితం మీద ఎలా పడతాయి? ఇన్నయ్య గారిని అడగండి. మీకు గ్రహాల గురించి ఇంకా వివరంగా చెపుతారు.

    రిప్లయితొలగించండి
  24. ఇన్నయ్యగారి మాటలు మీకు ప్రాతిపదికైతే నేను కలిసిన వ్యక్తులు నేను చూసిన సంఘటనలు నాకు ప్రాతిపదిక.

    రిప్లయితొలగించండి
  25. దెయ్యాల్ని చూసాము అని చెప్పేవాళ్ళు ఉన్నారు, తమ బంధువుల మీద దాయాదులు చేతబడి చేశారని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. నేను మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్న పల్లెటూర్లలో కూడా తిరిగాను. 2002-2006 మధ్య కాలంలో మా అమ్మానాన్నలు తూర్పు గోదావరి జిల్లాలోని ఒక పల్లెప్రాంతానికి బ్యాంక్ ఉద్యోగం ట్రాన్స్ఫర్ వల్ల వెళ్ళారు. నేను కూడా వాళ్ళతో కలిసి అక్కడే ఉండాల్సి వచ్చింది. అక్కడ జంతు బలులు ఇచ్చేవాళ్ళని, గుడి దగ్గర వేప మండలతో బాదుకునేవాళ్ళని, బొగ్గుల మీద పరిగెత్తేవాళ్ళని కూడా చూసాను. ఇన్ని మూఢనమ్మకాల మధ్య సహజీవనం చేసిన నేను నాస్తికునిగా మారడం నాకే ఆశ్చర్యం కలిగించింది. ఇన్నయ్య గారు ఏ వాతావరణంలో పుట్టి పెరిగారో నాకు తెలియదు కానీ నేను తిరిగిన వాతావరణంలో తిరిగితే మాత్రం మూఢనమ్మకాలు సులభంగానే అంటుతాయి. పల్లెటూర్లలో కూడా ఊరికి ఒకరో ఇద్దరో నాస్తికులు ఉంటారు కానీ నమ్మకాల్ని ప్రశ్నించే ధైర్యం లేక నోరు మూసుకుంటారు. 2006 కి ముందు నేను కూడా ఇలాగే నోరు మూసుకుని ఉండేవాడిని. ఇన్నయ్య గారి వ్యాసాలు చదివిన తరువాత ధైర్యం పెరిగింది.

    రిప్లయితొలగించండి
  26. అజ్ఞాతమే 16, 2009

    బాబు ప్రవీణ్ చూడబొతే ఇన్నయ గారి వ్యాసాలను వారి అబ్బాయి కూడా చదివేట్టు లేడు. వారి అబ్బయి అమేరికా లో ఒక పెద్ద పేపర్ కి ఎడిటర్. ఇప్పటి వరకు ఆయాన బ్లాగ్ లో వారీ అబ్బయి పేరు ఎప్పుడైనా చూసావా నువ్వు. బాబు ఆయన బ్లాగ్లు చదువుతు నీ జీవితం పాడు చేసుకోకు. నీ లాంటి వారే ఆయనకు బ్లాగుకు శ్రీ రామరక్ష..

    రిప్లయితొలగించండి
  27. అజ్ఞాత గారు,
    ప్రవీణ్ నిజంగానే అమాయక చక్రవర్తి. మీరు గమనించారోలేదో కానీ విషయాలు చాలా తెలుసుకోవాలని అతనికి కోరిక, దానికి తగ్గట్టు కృషి కూడా చేస్తాడు. కాకపోతే అది వ్యక్తపరచడంలోనే చాలా ఇబ్బందులు. అతను నాస్తికుడనని చెప్పుకున్నా అది దైవత్వము అంటే ఏమిటో తెలియక పోవడమే ! దైవత్వమంటే బహుశా ఒక ఆకారానికి దండం పెట్టడము మాత్రమే అని నిర్వచించుకోవడంతో తను నాస్తికుడనయ్యాను అని చెప్తున్నాడనుకుంటా!!!

    రిప్లయితొలగించండి
  28. చిన్నప్పుడు నేను కూడా దేవుడిని నమ్మేవాడిని.
    http://www5.praveen.pkmct.net/2009/03/blog-post_9745.htmlఈ ఫొటో పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల గ్రామం వద్ద తీసినది. ఈ ఫొటో దేవాలయం దగ్గర తీసారనడానికి ఈ ఫొటోలేనే ఎవిడెన్సెస్ కనిపిస్తాయి. ఈ ఫొటోలో కాలికి చెప్పులు ఉండవు, కొండ మీద తీసినట్టు కనిపిస్తుంది (ద్వారాకా తిరుమల ఆలయం కొండ మీదే ఉంది). నిజాలు తెలుసుకోవాలనే తపన వల్లే నాస్తికుడినయ్యాను. ఇన్నయ్య గారే కాకుండా ఇంకా చాలా మంది నాస్తికులు నాకు తెలుసు. మేము తూర్పు గోదావరి జిల్లా రాజోలులో ఉన్నప్పుడు బస్సులో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, నరసాపురం పట్టణాలకి అప్ & డౌన్ అయ్యేవాడిని. అక్కడే DTP, నెట్వర్కింగ్ వగైరా నేర్చుకున్నాను. పాలకొల్లు పట్టణంలో సోలోమన్ రాజు అనే నాస్తికుడు నాకు పరిచయమయ్యాడు. సోలోమన్ రాజు, అతని మిత్రుడు సుబ్బరాజు గార్లతో కలిసి నేను కూడా నాస్తిక ఉద్యమంలో కొంత కాలం పని చేశాను. వందేళ్ళలో ఎన్ని సార్లు గ్రహణాలు వస్తాయో, అవి ఎన్ని సార్లు పూర్తిగా కనిపిస్తాయో, ఎన్ని సార్లు పాక్షికంగా కనిపిస్తాయో సుబ్బరాజు గారిని ఒకరు అడిగితే వెంటనే చెప్పేశారు. జ్యోతిష్యులు మాత్రం రాహుకేతువులు గురించి సమాధానం చెప్పడానికి గింజుకుంటారు. అజ్ఞాత బాబు, నా బ్లాగుల్లో నేనెక్కడా నిమ్మకాయల నుంచి ఎర్రని ద్రవం కారడం గురించి వ్రాయలేదు కానీ చదువుకున్న వాళ్ళలో కూడా అలాంటివి నమ్మేవాళ్ళు ఉన్నారు. మా ఇంటిలో వాళ్ళు ఇంటి ముందు దృష్టి కోసం కట్టిన బూడిద గుమ్మడి కాయ కింద పడి పగిలింది. చేదు వాసన వస్తోందని వాటర్ పైప్ తో నీళ్ళు కొట్టి చీపురుతో తోస్తూ కడుగుతున్నాను. మా ఇంటిలో అద్దెకి ఉండే అతను వచ్చే ఆ పని నువ్వు చెయ్యకూడదు, ఏ కూలీవాడికో, రిక్షావాడికో డబ్బులిచ్చి చెయ్యించాలి అని అన్నాడు. ఆ పని నేను చేస్తే అశుభమట, లోయర్ స్టేటస్ గల వారి చేత మాత్రమే అలాంటి పనులు చెయ్యించాలట. నెల్లూరు నగరంలో పుట్టి పెరిగి ఈ నమ్మకాలు నేర్చాడు అతను. ఏ మారుమూల పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తో ఈ రకం చాదస్తాలని నమ్మితే ఆశ్చర్యం కలిగేది కాదు కానీ జిల్లా కేంద్రాలైన నెల్లూరు, శ్రీకాకుళంలలో తిరిగే వ్యక్తి అలాంటి వాటిని నమ్మడం చూసి ఏమనుకోవాలి?

    రిప్లయితొలగించండి
  29. ప్రవీన్ గారూ మీలొ విషయాలు తెలుసుకోవాలనె మంచి తపన ఉంది. @ అజ్గ్యాత & రామిరెడ్డిగారు అన్నట్టు అది సరియైన మార్గంలో ఉన్నట్టు అనిపించడం లేదు. నా అంచనా సరియైతే మీ ఇంట్లోవారు కూడా మీతో చాలా విషయాలలొ విభేదిస్తూ ఉండొచ్చు. మీరు చెపుతున్న వ్యక్తులు జీవితకాలం అదే అభిప్రాయంతో ఉంటారని అనుకోకండి. సంఘంలో్‌లో గుర్తింపుకోసం వితండవాదం చేసేవారు ఉంటారు. వారిని ఆదర్శంగా తీసుకొని మీ జీవితాన్ని పాడుచేసుకోకండి. మీరెంతసేపు మోసపూరిత సంఘటనలనే ఉదహరిస్తున్నారు. కాని నేను

    రిప్లయితొలగించండి