6, జూన్ 2010, ఆదివారం

న్యూస్ రీడర్ శాంతిస్వరూప్‌తో ఒక రోజు...!!


ఆ రోజు ఉదయాన్నే శాంతిశ్వరూప్ గారికి ఫోన్ చేశాను."గుడ్మార్నింగ్ సర్" అన్నాను. "గుడ్‌మార్నింగ్ శ్రీను" అంటూ విష్ చేశారు. " మిమ్మల్ని కలవాలి" అన్నాను. "ప్రస్తుతం షటిల్ బాడ్మింటన్ ఆడుతున్నాను. పదిగంటలకు ఇంటికి రాకూడదూ" అన్నారు. "సరే పదిగంటలకు వస్తాను" అన్నాను. ఆయన షటిల్ బాడ్మెంటన్ బాగా ఆడతారు. ఆయనను చూసి రెచ్చిపోయి షటిల్ ఆడుతూ మోకాలుకు దెబ్బ తగిలించుకొని డాక్టర్ సలహామీద షటిల్ ఆడడం నేను మానివేశాను. ఆయన క్రమం తప్పకుండా రోజూ షటిల్ ఆడతారు. మన అలవాటు ప్రకారం గంట ఆలస్యంగా వారి ఇంటికి చేరుకున్నాను. హైదరాబాదులో రామంతాపూర్‌లోని టీవీ కోలనీలో ప్రస్తుతం వారి నివాసం. విశాలమైన ఇల్లు ఇంటిముందు రెండు కార్లు ఉన్నాయి. గేటు తీసి కొద్దిసేపు వేచి చూశాను, కుక్కలుగానీ ఉన్నాయేమోనని. నా అదృష్టంకొద్దీ లేవని మాలిగాబోలు చెప్పడంతో ధైర్యంగా లోపలికి అడుగుబెట్టాను. ఒక పెద్దావిడవచ్చి కూర్చోమని చెప్పి లోపలికి వెల్లింది. నేను వారి రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను.

శాంతిశ్వరూప్ మొట్టమొదటి తెలుగు టీవీ న్యూస్ రీడర్. ఇరవై సంవత్సరాలకు పైగా తెలుగు వార్తలు చదివిన వ్యక్తి కూడా ఆయనొక్కరే. న్యూస్ రీడర్‌గా, వ్యఖ్యాతగా, యాంకర్‌గా ఆయన తెలుగువారందరికి సుపరిచితులు. వార్తలు చదవడంలో ఆయనది విలక్షణమైన శైలి. తెలుగు భాషమీద మక్కువ ఎక్కువ అనేది ఆయన మాటల్లోనే తెలుస్తుంది.

తెల్లని బట్టలలో చిరు ధరహాసంతో ఆయన వచ్చి కూర్చున్నారు. "చెప్పు శ్రీను ఏమిటి విశేషాలు?" అన్నారు. నా భ్లాగింగు గురించి ముందే వారికి చెప్పాను గాబట్టి నేరుగా "దూరదర్శన్‌లో మీరు ఎలా ప్రవేశించారు?" అని అడిగాను. "1974 లో నేను దూరదర్శన్‌లో ప్రవేశించాను. కానీ అంతకు ముందు నేను ఆకాశవాణీలో పనిచేస్తూ ఉండేవాడిని. 1970 నుండీ 1974 దాకా ఆకాశవాణిలో పనిచేశాను. ఆకాశవాణీలో ముందు క్యాజువల్ అనౌన్సర్‌గా పనిచేస్తూ ఉండేవాడిని. కొంతకాలానికి దానిలోనే న్యూస్‌రీల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. అది ఒక సంవత్సరం చేసి కొన్ని కారణాలవల్ల రిజైన్ చేశాను. తరువాత దూరదర్శన్‌లో చేరాను. దూరదర్శన్‌కి రావడంలో నామితృడు శశిధర్ (ఎం.సి.వి.శశిధర్ ఆయన ఇప్పుడు లేరు) సహాయం చేశాడు. 1974లో దూరదర్శన్‌లో (సైట్ ద్వారా) విద్యా సంబంధ కార్యక్రమాలు చేసే వాళ్ళం. అవి అహమ్మదాబాదు నుండీ ప్రసారం అవుతూ ఉండేవి. అప్పట్లో ఇక్కడ దూరదర్శన్ కేంద్రం లేదు.1977 లో ఇక్కడ దూరదర్శన్ కేంద్రం ఏర్పాటు చేశారు. అప్పుడు నన్ను న్యూస్ రీడర్‌గా ఎంపిక చేశారుగానీ 1983 లో వార్తా ప్రసారాలు ప్రారంభం అయ్యాయి. అప్పటినుండీ 2004 దాకా వార్తలు చదువుతూనే ఉన్నాను" అన్నారు.


"మీ శ్రిమతి రోజా రాణి్‌తో మీ వివాహం ఎలా జరిగింది?" అని అడిగాను."నేను చిక్కడపల్లిలో ఉండేవాడిని. మా స్నేహితులతో కలసి నాటకాలు రిహార్సల్స్ అవీ వేస్తూఉండేవాళ్ళం. మొదటిసారి ఆమెను చిక్కడపల్లి వెంకటేస్వర స్వామి గుడిదగ్గిర చూశాను. నేను ఆకాశవాణిలో రిజైన్ చేశాక కొంతకాలం రేడియోలో వచ్చే వ్యాపార ప్రకటనలకు వాయిస్ ఇచ్చేవాళ్ళం. అలాగే ఆమెకూడా వచ్చేది.ఆమె తన తండ్రిని వెంటబెట్టు వచ్చేది. ఏనాడు పలకరించలేదు. కానీ ఆమె నా స్నేహితుడి చెల్లెలని తరువాత తెలిసింది" అన్నారు నవ్వుతూ." 1964లో వచ్చిన తేన మనసులు సినిమాలో ఆమె బాలనటిగా చేసింది. 1979లో ఆమె దూరదర్శన్‌లో అనౌన్సరు గా చేరింది. 1980 ఆగస్టు 21న మా వివాహం జరిగింది". "మీ కుటుంబము గిరించి పిల్లలగురించి
చెప్పండి" అంటే " నేను పుట్టి పెరిగింది హైదరాబాదులోనే. బీఎస్సీ చేశాక ఎమ్మె ఇంగ్లిష్ చేశాను. మాకు ఇద్దరు పిల్లలు. పెద్దవాడు మేఘాంశ్ ఎమెస్(ఐఐటీ) చేసి ప్రస్తుతం లాస్‌వెగాస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. రెండవవాడు అవ్యయ. బెనరన్ హిందూ యూనివర్సిటీలో ఏం.టెక్ చేస్తున్నాడు"."దూరదర్శన్ ఒక్కటే ఉన్న రోజుల్లో మీకు మంచి ఫాలోయింగ్ ఉండేదిగా" అంటే "నిజమే నన్ను అప్పటి హీరో ఎంటీఅర్ లాగ చూసేవాళ్ళు.దూరదర్శన్‌లో ప్రసారమైన కొన్ని కార్యక్రమాలు ప్రజలకు ఎలా చేరుతున్నాయో సర్వే చేయడానికి కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆ ఊరిప్రజలంతా చూడడానికి వచ్చి నాకు కొన్ని విగ్జ్నాపన పత్రాలు ఇచ్చి ప్రభుత్వానికి అందచేయమనేవాళ్ళు. నేను చెపితే తమ పనులు అవుతాయని వారు నమ్మకంతో ఉండేవాళ్ళు. కొన్ని సభలకు అతిధిలుగా వెళ్ళడం ఆలస్యం అయినప్పుడు ఎందరో రాజకీయ నాయకులు కూడా మా కోసం వేచి ఉండేవాళ్ళు" అన్నారు నవ్వుతూ. "ప్రస్తుతం మీరు వార్తలు చదవడం లేదు కారణం ఏమిటి?" అంటే

"దూరదర్శన్ తీసుకున్న నిర్నయాలు కొన్ని, రోజా (భార్య) దీర్ఘకాల అనారోగ్యం కొంత వార్తలకు దూరం చేశాయి. ప్రస్తుతం నేను చేస్తున్న "ధర్మ సందేహాలు" కార్యక్రమం లో పెద్దలు మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారూ, కందాడై రామానుజాచార్య వంటి పెద్దల సమక్షంలో కూర్చోవడమే మహాద్భాగ్యంగా భావిస్తున్నాను". "మీరు కొన్ని నవలలు కూడా రాశారు కదా వాటివివరాలు ఏమిటి" అన్నాను.
"అవును నేను రాసిన మూడు నవలలు ఆంధ్రభూమిలో ధారావాహికలు గా వచ్చాయి. రాతిమేఘం అనే నవల భోపాల్ గ్యాస్ దుర్ఘటనమీద రాశాను. అలాగే క్రేజ్ అనే నవల క్రికెట్ మీద, అర్ధాగ్ని అనే నవల సతీ సహగమనానికి వ్యతిరేకంగానూ రాశాను. అలాగే కొన్ని కవితలు రాశాను, వాటిని నా మితృలు పుస్తకాలుగా ముద్రించారు." "మరి మీ రచనలు ఎందుకు ఆగిపోయాయి?" అని అడిగాను. "అప్పట్లో పత్రికలలో జరుగుతున్న కొన్ని సంఘటనలు నాకు నచ్చలేదు. నాకు ఆ వాతావరణము నచ్చలేదు. క్రమంగా వాటికి దూరమయ్యాను" అన్నారు. "ప్రస్తుతం టీవీ న్యూస్ రీడర్లు ఎలా ఉన్నారు?" "వాళ్ళు ఇంగ్లీష్ వాడకం తగ్గించాలి" అన్నారు."మీకు నచ్చిన న్యూస్ రీడర్?" "నేను అస్సలు టీవీ చూడను, పుస్తకాలు మాత్రం చదువుతాను"

వారి శ్రిమతి రోజారాణి గత సంవత్సరం కేన్సర్ వ్యాధినపడి మరణించడం దురదృష్టకరం. శాంతిస్వరూప్ ఎలాటి కార్యక్రమమైనా, ఏ విషయంపైనైనా, ఎక్స్పర్ట్ ఎవరైనా ముందస్తు ఏర్పాటు లేకుండా అప్పటికప్పుడు ఏకధాటిగా కార్యక్రమాన్ని నడుపగల దిట్ట. ఆవకాయ నుండి అంతరీక్ష విషయాలవరకు చర్చించగల గల వ్యక్తి. చానల్స్‌లో అంతటి అనుభవగ్జ్నులు లేరంటే అతిశయోక్తి కాదు.జనవరి 2011 లో ఆయన పదవి విరమణ చేయబోతున్నారు. మరి మీ భవిష్యత్తు కార్యక్రమం ఏమిటి అంటే "రేపటి గురించి ఆలోచించే అలవాటు నాకు లేదు. ఎగసివచ్చే ప్రతీ అల తీరాన్ని ఆక్రమించాలని అనుకుంటుంది. కానీ కేవలం అది నురగగానే మిగిలి పోతుంది. జీవితం కూడా అంతే. ప్రతీదీ లిఖితమై ఉంటుంది. మనం నిమిత్తమాత్రులమే" అన్నారు శాంతిస్వరూప్. ఏదిఏమైనా ఎందరో తెలుగు ప్రజల మనసుల్లో ఒక స్థానాన్ని పదిలపరచుకున్న వ్యక్తి శాంతిస్వరూప్. వారి కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ ...
శాంతిస్వరూప్ గారికి అభినందనలతో ....సమీహ!!



37 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. really gud article..my best reegards to santi swarup garu

    రిప్లయితొలగించండి
  3. Lakshmi Rameshజూన్ 06, 2010

    santhi swaroop gari gurunchi eennalla nundo thelisukovalani ankuntunna vishayalu chadivi chala aanandam kaligindi.Roja Rani garu leru anna vishayam chala badha kaligindi.
    Best Wishes To Santhi Swaroop garu...

    రిప్లయితొలగించండి
  4. Thank you for a good interview. Can you do similar interviews with many Radio Artists that are living in Hyderabad like Ratan Prasad, Sudhama and many more.

    రిప్లయితొలగించండి
  5. అజ్ఞాతజూన్ 06, 2010

    ధన్యవాదాలు. మంచి ఇంటర్వ్యూ.

    రిప్లయితొలగించండి
  6. శాంతి స్వరూప్ ఇంటర్వ్యూ బావుంది మదిలో నిలిచిపోయి
    మరచిపోయిన మంచిమనిషిని గుర్తు చేసారు .ఆయన ఉచ్చారణ
    వేరేవరకి రాదు .వారి అంత గాను పాపులర్ అయిన వారి శ్రీమతి
    రోజా గారు పోయారని తెలిసి ఆత్మీయులు పోయిన భావం కలిగింది
    నా తరఫున వీలయితే ప్రఘాడ సాను భూతి తెలియ చెయ్యండి ,

    రిప్లయితొలగించండి
  7. ఈ ఇంటర్వ్యు రెగ్యులర్ మీడియా ఎందుకు చేయలేదు? శాంతి స్వరూప్ మా చిన్నప్పుడు పాప్యులర్ ఫిగర్. ఆయనకు ఇద్దరు భార్యలని పల్లెటూళ్ళ లో అనుకుంటారు. ఎంతవరకు నిజం?

    శ్రీనివాస్

    రిప్లయితొలగించండి
  8. @ కార్తీక్, మందాకిని,లక్ష్మీ రమేష్,శివ,అజ్గ్నాత,జగదీష్ గార్లకు ధన్యవాదాలు.

    @రవి గారూ మీ మాటలను శాంతిస్వరూప్ గారికి తప్పకుండా తెలియ చేస్తాను

    @తెలుగు న్యూస్ శ్రీనివాస్ గారూ ...నిజమే ఆయన అందరినీ ఇంటర్వ్యూ చేయడమేగానీ ఆయనను ఇంటర్వ్యూ చేసిన సందర్భాలు తక్కువ...ఇక పెళ్ళి విషయం ..అవి పిచ్చిమాటలు.

    రిప్లయితొలగించండి
  9. అజ్ఞాతజూన్ 07, 2010

    manchi interview. Santi svaroop garu nijamgane okappati bulli tera hero.

    Prasad

    రిప్లయితొలగించండి
  10. @ శివ గారూ... రేడియో అనౌన్సర్స్ తో ఇంటర్వ్యూలు చేయడానికి తప్పక ప్రయత్నిస్తాను.

    రిప్లయితొలగించండి
  11. ఇంటర్వ్యూ బావుందండీ, పాత ఙ్ఞాపకాలని తవ్వితీసినట్టయింది. శాంతిస్వరూప్ గారి వార్తలు క్రమం తప్పకుండా వినేవాళ్ళం ఇంట్లో. ఆయన శ్రీమతిగారు కూడా బాగా చెప్పేవారు సుమాంజలి అవీను. ఆవిడ పోయారంటే బాధగా ఉంది.

    శాంతిస్వరూప్ గారికి నా బెస్ట్ విషెస్ !

    రిప్లయితొలగించండి
  12. అయ్యో, రోజా రాణి గారు మరణించారా? ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేవారు! స్వరం కూడా ఎంతో సౌమ్యంగా ఉండేది.మాట్లాడే తీరు కూడా ఎంతో ఆత్మీయంగా ఉండేది..అవి కేవలం అనౌన్స్ మెంట్లు అయినా కూడా! శాంతి స్వరూప్ గారికి, పిల్లలకు ప్రగాఢ సంతాపం !

    రిప్లయితొలగించండి
  13. @ సౌమ్య గారూ...థాంక్స్. మీ విషెస్ శాంతిస్వరూప్‌గారికి తెలియచేస్తాను.

    @ సుజాత గారూ...కేన్సర్‌తో పది సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి రోజా రాణీగారూ గత సంవత్సరం చనిపోయారు.

    రిప్లయితొలగించండి
  14. సమీహ గారు..నేను శాంతి స్వరూప్ గారి అభిమానిని. ఆయనను కలవాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. నాకు ఆయన చిరునామా ఇవ్వగలరా?

    రాజన్

    rajanptsk@gmail.com

    రిప్లయితొలగించండి
  15. @ Rajan Garu... Shanti Swaroop, News Reader, Doordarshan Kendra, Ramanthapur, Hyderabad-500013

    రిప్లయితొలగించండి
  16. @sameeha , thank you for the interview.
    btw , shanthi swaroop garu has started a blog here the link http://shantiswarupnews.blogspot.com/
    Enjoy, the interesting articles.
    Thank you once again!

    రిప్లయితొలగించండి
  17. సమీహ గారూ,
    మీ నుంచి ఒక సహాయం అవసరమైంది. దయ చేసి నాకొక మెయిల్ పెట్టగలరా! sumadhuravaani@googlemail.com

    రిప్లయితొలగించండి
  18. Madhuravaani garu, i am unable to send mail. You can contact me on vadrevu_srinivas2004@yahoo.co.in

    రిప్లయితొలగించండి
  19. Naa chinna tanam gurtochndi.... kantlo neelu tirigai.....anandam tho..... daily 7 P.M. maa nana offic enunchi vachi news choosevadu :) Nice article.

    రిప్లయితొలగించండి
  20. 1) mee blog over all chala pleasant ga vundi.
    2) omkar swarup even today when we watch him
    on doordarshan is very energetic person. Secondly he is very very obedient to all his guest (dharma)who are experts in vedanta. that is very nice. May god bless him.
    3) your review is very touching.
    4) about DD in general. most of the time we look for breaking news and more active content. Over the last few years I learnt few things. If you want to peaceful watch DD. Second what other show DD can always present but not vice versa.

    with best regards

    రిప్లయితొలగించండి
  21. అజ్ఞాతజులై 29, 2012

    when the doordarshan time shantiswaroopgari news reading expressions and roja rani gari anchoring very excellent. but it very sad that roja rani no more.

    రిప్లయితొలగించండి
  22. It's good to know about Shanti Swaroop garu. I tried to know more about him and his where abouts over Wikipedia or internet long back. But I could not find much info. It is more sad to know that Roja Rani garu is no more now.

    రిప్లయితొలగించండి
  23. Shanthi swaroop gari interview choosthe really I am very happy

    రిప్లయితొలగించండి
  24. ఇంటర్వ్యూ బావుందండీ, పాత ఙ్ఞాపకాలని తవ్వితీసినట్టయింది. శాంతిస్వరూప్ గారి వార్తలు క్రమం తప్పకుండా వినేవాళ్ళం ఇంట్లో. ఆయన శ్రీమతిగారు కూడా బాగా చెప్పేవారు సుమాంజలి అవీను. ఆవిడ పోయారంటే బాధగా ఉంది.

    శాంతిస్వరూప్ గారికి నా బెస్ట్ విషెస్ !

    రిప్లయితొలగించండి
  25. shanti swaroop garini and madam roja rani gari gurinchi talachukunna and vinna, golden days gurthukosthayee and thaluchukunte manasuku entho hayee ga vuntundi

    రిప్లయితొలగించండి
  26. Madam roja rani garu leru ante entho badhakaluguthondi

    రిప్లయితొలగించండి
  27. Madam roja rani garu leru ante entho badhakaluguthondi

    రిప్లయితొలగించండి
  28. shanti swaroop garini and madam roja rani gari gurinchi talachukunna and vinna, golden days gurthukosthayee and thaluchukunte manasuku entho hayee ga vuntundi

    రిప్లయితొలగించండి
  29. SAIRAM Sir,
    Greetings. I lost you mobile no. I want to talk to you. My mobile no is 9445005866.
    Regards

    రిప్లయితొలగించండి
  30. హలో అండి, సమీహ గారు, ఇప్పటికీ ఈ బ్లాగ్ మీరు చూస్తూ ఉంటారు అనుకుంటున్నాను. కొంచెం లేట్ గా కొంచెం ఏమిటీ చాలా లేట్ గా స్పందిస్తున్నాను. ముందుగా మీ కాంట్రిబ్యూషన్ టు ఇంటర్వ్యూ శాంతిస్వరూప్ గారు చాలా బావుంది. అభినందనలు. ఆయన భార్య గారి ఫొటోస్ కొన్ని ప్రచురించి ఉంటే అప్లోడ్ చేయండి. ఆవిడ దూరదర్శన్ లో పని చేస్తున్నప్పుడు కొన్ని కార్యక్రామాలు చేశారు. లీల గా గుర్తు. అప్పట్లో చిన్న తనం లో ఆకోర్సు నా చిన్న తనంలో రోజా రాణి గారికి విజయదుర్గ గారికి మధ్య తేడా గుర్తుపట్టలేక పోయేయివాడిని. అలానే వోలేటి పార్వతీశం అని ఒక ఆయన జాబులు జవాబులు అనే కార్యక్రమం నిర్వహించేవారు. మంచి సాహితీ వేత్త. ఎప్పుడైనా ఆయన తారసపడితే ఆయన ఇంటర్వ్యూ ప్రచురించండి. మరోసారి మీ కాంట్రిబ్యూషన్ కి అభినందనలు

    రిప్లయితొలగించండి