27, డిసెంబర్ 2008, శనివారం

తెలుగులో బ్లాగులు

బ్లాగు నిర్వహణలో నాకు కొంత పరిచయం ఉంది. దాదాపు సంవత్సరం క్రితం ఇంగ్లీషులో ఒక బ్లాగు ప్రరంభిచాను. అది మా ఉద్యోగుల కోసం. అది అతి తక్కువ కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. రోజు వందల సంఖ్యలో దానిని చూస్తుంటారు. నేను అనుకోకుండా ఒక రోజు తెలుగోలో బ్లాగులు చూడటం జరిగింది. అవి చూసి నన్ను నేను మరిచిపోయనంటే నమ్మండి. అదిగో దాని ప్రభావమే ఈ బ్లాగు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక పది ఇరవయ్ పత్రికలలో కార్టూనులు గీసేవాడిని . అది ఒక సరదా. జేబు ఖర్చులుకని ఇచ్చిన డబ్బులన్నీ దీనికే పోయేవి. మధ్యలో ఎవరైన ఒకరిద్దరు డబ్బులు పంపించేవారు. ఆంధ్ర పత్రిక, యువ, ఆంధ్ర ప్రభ మాత్రం పారితోషికం పంపేవారు. అమ్మ చదువు మానేసి ఆ బొమ్మలేమిటి అని కోప్పడేది. నాన్న మాత్రం కార్టూనులు చూసి ప్రోత్సహించేవారు. ఉద్యోగంలో చేరేదాక కార్టూనులు గీసేవాడిని. తరువాత మరల వీలు కలుగలేదు. కాని ఆ ఉత్సాహంతో టీవీలో చాల మంది కార్తూనిస్ట్లులని పరిచయం చేశాను. ఈనాడు శ్రీధర్, క్రానికాల్ సుభాని, జ్యోతిలో పనిచేస్తున్న శేఖర్, ఇంక ముఖ్యంగా బాలి తో పరిచయం, నాకు మంచి మిత్ర బృందం ఏర్పడింది. జయదేవ్ గారితో కూడా ఒక మంచి కార్యక్రమం అంటే పిల్లలకోసం బొమ్మలు గీయటం కూడా చేసాము. జయదేవు గారు హైదరాబాదులో ఉండలేక మరల చెన్నై వేల్లిపోయరనుకోండి. నా మొదటి గురువు మాత్రం భగవాన్ గారు. గుండు బొమ్మల కార్టూనిస్టు. అలాగే గోపాలకృష్ణ గారు కూడా. మేమంతా పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు లో ఉన్నప్పుడు అక్కడ గ్రంధాలయ ఉత్సవాలలో కార్టూన్ ఎగ్జిబిషన్ పెట్టేవాళ్ళం. భగవాన్ గారు వృత్తి రీత్యా లెక్చరర్. గోపాలకృష్ణ గారు మాత్రం అనిమషన్ రంగం లో స్థిరపడ్డారు. హైదరబాద్ వఛాక నేను కలసిన మరొక మంచి ఆర్టిస్టు ఉత్తమ్. అయన గీనిన "ఛండాలుడు " పైంటింగ్ నేను ఇప్పటికి మరచిపోలేకున్నాను. అయనకి ఒకసారి ఫోను చేస్తే సినిమా తీస్తున్నాం అని చెప్పారు. హైదరాబాదులో అనిమషన్ రంగం ప్రారంభకులు ఆయెనే అని చెప్పొచ్చు. వీరి పూర్తీ వివరాలతో మరొకసారి కలుస్తాను లెండి.


5 కామెంట్‌లు:

  1. బ్లాగ్లోకానికి సుస్వాగతం..

    రిప్లయితొలగించండి
  2. స్వాగతం.

    భగవాన్ గారు ఆల్రడీ బ్లాగు మొదలెట్టారు. మిగతా వారి వివరాలు మీరందిస్తే చాలా సంతోషం.

    రిప్లయితొలగించండి
  3. బ్లాగుల ప్రపంచానికి స్వాగతం.
    బావున్నాయ్ మీ పొస్టులు..
    మీరు చెప్పిన రైలు ప్రయాణం లానే ఉండొచ్చు మీ ఈ బ్లాగు ప్రయాణం కూడా. :)

    రిప్లయితొలగించండి
  4. బాగున్నాయండి మీ బ్లాగులు.

    రిప్లయితొలగించండి
  5. సమీహితము అంటే కోరబడినది అనే అర్ధం ఉంది.మరి సమీహ అంటే ఏమిటో చెప్తారా దయచేసి.

    రిప్లయితొలగించండి