ఆ రోజెందుకో నాకు ఉదయాన్నే మెలుకువ వచ్చింది. నెమ్మదిగా లేచి బాల్కనీలోకి వచ్చాను. తెల తెలవారుతోంది. చిరు చీకట్లని సూర్య కిరణాలు తరిమే ప్రయత్నం చేస్తున్నాయి. వాతవరణం చాలా ప్రశాంతంగా చల్లగా ఉంది. మాది మా అపార్టుమెంటులో ఐదవ ఫ్లోరు. దూరంగా పచ్చని చెట్లు. కొద్దిపాటి మంచు కురుస్తూ ఉందటం వల్ల ఆకాశం లోని మబ్బులన్ని భూమి మీదకి వచ్చేసినట్లు ఉంది.అదృష్టవశాత్తు మాకు కోయిల అరుపులు కుడా వినిపిస్తూ ఉంటాయి. మా అపార్టుమెంటు పక్కనుండీ నల్లటి తారు రొడ్డు వెడుతుంది. దాని మీద అప్పుడే మనుష్యుల సంచారం మొదలైంది. వారిని కొద్దిగా పరికించి చూస్తేరకరకాల వయస్సులవాళ్ళు వేగంగా నడుస్తూ మార్నింగ్ వాక్ చేసున్నారు. కొందరితోబాటు వారి అర్ధాంగులు కుడా నడుస్తూ కనిపిస్తున్నారు. వారందరికి ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధో? జీవితంలో ఎంతో కొంత డిసిప్లెన్ లేకపోతే ఇలా ఉదయాన్నే ఎక్సర్సైజులు చేసే క్రమశిక్షణ అలవాటవ్వదు. ఎక్సరసైజులవల్ల ఆరోగ్యంగా ఉండగలగడం, దానివల్ల ఆనందంగా ఉండటం జరుగుతాయి. మనుషులు కూడా ఎంతో నాజూకుగా ఉంటారు. ఒక్కసారి నావైపు చూసుకున్నాను. తిండి మీద అదుపు లేకపోవడంవల్ల పెరిగిన శరీరం, దానికి కల్లు కుండ తగిలించినట్టు పెరిగిన పొట్టా నా మీద నాకే వికారం కలిగింది. నేను కూడ కాస్త ఉదయాన్నే నడిస్తే? ఆరోగ్యం, ఆనందంతొపాటు జీవితం లో క్రమశిక్షణ వస్తాయేమో? ఇవాల్టినుండి నా జీవిత విధానం మార్చుకోవాలని నిర్నయించుకున్నాను. ఇకనుండి చికెన్, మఠన్ తినడం మానేయాలి. సిగరెట్లు, టీలు కుడా మానెయ్యాలి. కేవలం సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి. మధ్యాహ్నం కొద్ది కూరతొ అన్నము తినాలి. రాత్రి రెండు పుల్కాలో లేక రొట్టెలో తిని ఊరుకొవాలి. మరో విషయం రోజూ ఉందయాన్నే టీవీల్లో వచ్చే బాబా రాందేవ్ గారి యోగా నేర్చొకోవాలి. ఆయనలా పొట్టని లోపలికి బైటకి కదపగలిగితే ఈ బాన పొట్ట కూడా తగ్గిపోవచ్చు. కాబట్టి టీవీ చూడటం కుడా అలవాటు చేసుకోవాలి. ఆ నిర్నయం తీసుకోగానే నేను సన్నగా సంపూర్న అరోగ్యవంతుడిని అయిపొయినట్టు అనుభూతి కలిగింది. నిర్నయం తీసుకున్నందుకే ఇంత ఆరోగ్యం అనిపిస్తే నిజంగా ఎక్సరసైజులు చేస్తే ఇంకెంత అరోగ్యం కలుగుతుందో తలుచుకుంటే సంబరం వేసింది. ఆరోజు ఉందయాన్నే మావిడ ప్లేటులో పెట్టిన డజను ఇడ్లీలనుండీ పది ఇడ్లీలను పక్కన పెట్టేశాను. నెయ్యి కూడ వేసుకోకుండా రెండు ఇడ్లీలు తిని ఆఫీసుకు బయలుదేరేను. ఆఫేసులో ఉత్సాహంగా పని మొదలు పెట్టాను. గంట గడిచింది. పొట్టలో కొద్దిగా తేడాగా అనిపించింది. మరో గంట గడిచింది. పేగులు అరుపులు మొదలు పెట్టేయి. దీనినే ఆకలి అంటారుగాబోలు. కొద్దిసేపటికి మా కొలీగ్ సంబరంగా వచ్చి ఈ రోజు మీ అందరికి హొటల్ పేరడైస్‌లో ట్రీట్ ఇస్తున్నాను మీరందరు తప్పక రావాలని ఆహ్వానించాడు. ఎందుకని అడిగితే మా అబ్బాయికి ప్లేస్‌మెంట్ వచ్చింది అన్నాడు. నేను సందిగ్దంలో పడ్డాను నా ఆరోగ్య నియమాల విషయం తలుచుకొని. ఎలాగైనా అరోగ్యమే ముఖ్యం, మిగిలిన విషయాలకన్నా అనుకొని పార్టీకి వెళ్ళకూడదనే తీర్మానించుకున్నాను. నెమ్మదిగా లంచ్ టైం కావస్తోంది. ఆకలి విపరీతంగా పెరిగింది. నెమ్మదిగా నా కేరేజ్ తెరిచాను. రొజూలా కాకుండా దానిలో బుల్లి కప్పుడు రైస్, కొద్దిగా పొట్లకాయ కూర ఉంది. మామూలుగూ అయితే అది నాకు ఒక్క ఐటం సరిపడా కూడా కాదు. నెమ్మదిగా ఉన్న అన్నాన్నే తిన్నాను. బహుశ నా పొట్టకి భొజనం చేసిన విషయం కుడా తెలిసి ఉండదు. కేరేజ్ మూసి నెమ్మదిగా నా సీట్లొ వాలేను. కొద్దిగా మగత వచ్చింది. మా కొలీగ్ వచ్చి లేపి పద అందరూ నీ గురించి వెయిట్ చేస్తున్నారు అన్నాడు. ఎక్కడికి అన్నాను నేను. అదేమిటి పేరడైస్‌లొ పార్టీ ఇస్తున్నానని చెప్పేను కదా అన్నాడు. నాకప్పటికే కళ్ళకింద నల్ల మచ్చలతో రోగిష్టిలా తయారయ్యానేమో అన్న ఫీలింగ్ వచ్చింది. నామీద నాకే చాల జాలి కలిగింది. వెధవ జీవితం అన్న భావము కలిగింది. దేముడు తిండికి శరీరానికి ఎందుకు లంకె పెట్టాడో కదా అనిపించింది. ఇలా జీవితం ఎంత కాలం గడపాలో? కానీ ఇప్పుడే భరించడం కష్టంగా ఉంది. ఇక లాభం లేదు, ముందు వాళ్ళతోపాటు హొటల్‌కి వెళ్లి సుష్టుగా భోజనం చేయాలి. అనుకున్నదే తడవు వెంఠనే బయలుదేరేను. హొటల్‌లో రెండు బిర్యానీలు లాగించాకాగానీ మనసు కుదుట పడలేదు. ఆరోజు సాయంత్రం ఇంటికొచ్చి పడక కుర్చీలో పడుకొని ఆలోచించసాగాను. నాకంత వయసు ఏమి అంత మించిపొయిందని, ఇప్పటినుండి ఉపవాసాలు చేయడానికి. నా పొట్ట నాకేవిధంగాను అడ్డుగా లేదు. తిండి మానేసి కడుపు మాడ్చుకుంటూ బాబా రాందేవ్ మాత్రం ఏమి సుఖపడుతున్నడో? ఈ భొజన నియంత్రణలు, వ్యాయామాలు, ఉదయపు నడకలు మరో పదేళ్ళ తరువాత మొదలు పెట్టవచ్చు. కడుపు నిండా నచ్చిన తిండి తినకుండా మరో పదేళ్ళు ఎక్కువ బతికి మాత్రం సుఖమేమి ఉంటుంది? నా నిర్నయం మంచిదే అని మనసులో అనుకున్నాను. చాలా హాయిగా అనిపించింది. రాత్రికి కోడి వేపుడు చేయమని మావిడకి ఉత్సాహంగా ఆర్డరు వేశాను.
24, మార్చి 2009, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ha ha ha..
రిప్లయితొలగించండిహ హ హ
రిప్లయితొలగించండికడుపు నిండా నచ్చిన తిండి తినకుండా మరో పదేళ్ళు ఎక్కువ బతికి మాత్రం సుఖమేమి ఉంటుంది?
రిప్లయితొలగించండినిర్నయం తీసుకోగానే నేను సన్నగా సంపూర్న అరోగ్యవంతుడిని అయిపొయినట్టు అనుభూతి కలిగింది. నిర్నయం తీసుకున్నందుకే ఇంత ఆరోగ్యం అనిపిస్తే నిజంగా ఎక్సరసైజులు చేస్తే ఇంకెంత అరోగ్యం కలుగుతుందో తలుచుకుంటే సంబరం వేసింది.
Mee too thinking Same LOL !!
'ఫన్ టాస్టిక్
రిప్లయితొలగించండిhmmmm ఇక మీ డెటింగ్ అయినట్టే.. అలా కాదుగాని మీ ఆవిడకు ఈ డ్యూటి అప్పచెప్పండి. ...
రిప్లయితొలగించండిఅయ్యో జ్యోతిగారు అచ్చు తప్పు. నేను ప్రయత్నిచింది డైటింగ్ మాత్రమే.
రిప్లయితొలగించండి