తెలుగు సాహితీ ప్రపంచంలొ భావ కవిత్వాన్ని సురభిళ శొభితంగా పరివ్యాపనం చేసిన సుప్రసిద్ధ జంట కవులు వేంకట పార్వతీశం కవులు. జంట కవి లోకంలొ తిరుపతి వేంకట కవులకు సమస్కంధంగా పేరెన్నికగన్న జంట కవులు వేంకట పార్వతీశం కవులు. బాలంత్రపు రజనీకాంతరావు గారి తండ్రియైన భాలాంత్రపు వేంకటరావుగారు, వొలేటి పార్వతీశంగారు కలసి ఈ జంట కవులు.శతాధిక గ్రంధ కర్తలు. వంగ భాషకో రవీంద్రుని గీతాంజలి లాగ, తెలుగు భాషకు ఈ జంట కవుల "ఏకాంత సేవ" ఖండకావ్యం మకుటాయమానమైన రచన. మాతృ మందిరం, బృ౦దావన౦, కావ్య కుసుమావళి, బాలసూర్యవాచకాలు, బాలగీతావళి, బొమ్మల రామాయ౦ ఇలా ఎన్నొ రచనలు వీరివి. వీరిలొ వోలేటి పార్వతీశ౦గారి మనవడే మన వొలేటి పార్వతీశం గారు. జన్మస్థలం అమలాపురమే ఐనా తాతగారి స్వస్థలం పిఠాపుర౦ తొ అనుబంధం ఎక్కువ. తండ్రి ప్రముఖ గేయ కవి శశాంక గారు. ఆయన అసలు పేరు సుబ్బారావు. ఆకాశవాణితొ పరిచయం ఉన్న తెలుగు వాళ్లెవ్వరూ విస్మరించలేని గొప్ప కవి శశాంక. ఆయన తొలి సంతానమే పార్వతీశం గారు.
దూరదర్శన్‌లొ మీ ప్రవేశం ఎలా జరిగిందని ప్రశ్నిస్తే " మా నాన్నగారు శశాంక చాలా చిన్న వయసులోనే పరమపదం చేశారు. అప్పటికి నేను ఇంటర్మీడీయట్ మాత్రమె పూర్తి చేశాను. ఆ తరువాత ఏదొ కష్టపడి బి.యస్‌సి. పూర్తి చేశాను. ఆర్ధిక స్థితి కారణంగానూ, ఇంటికి పెద్దవాడిని కావడంవల్లను మా తాతగారు శ్రీ క౦దుకూరి రామ భద్ర రావుగారి సూచన మేరకు శ్రీ పుల్లెల వేంకటెస్వర్లుగారి సౌజన్యంతో ఆకాశవాణి్‌లొ కాజువల్ ప్రొడక్షన్ అసిస్టంట్ గా తర్ఫీదు పొంది, శ్రావ్య కార్యక్రమాలకు రూప కల్పన చేశేవాడిని. ఉత్తరోత్తరా రాష్ట్ర రోడ్దు రవాణా సంస్థలో ఉద్యోగంచేసినా ఆకాశవాణిని విడిచిపెట్టలేదు.రేడియో కార్యక్రమాలకు రచన చేయడం, రేడియోలో స్వరాన్ని పలికించడం, కార్యక్రమాలకు రూపకల్పన చేయడం, ఇవన్నీ చెప్పలేనంత సంతోషాన్ని కలిగించేవి. ఆకాశవాణి ప్రాంగణంలో సంగీత సాహిత్యాలలో గొప్ప గొప్ప వారె౦దరితోనో సన్నిహితంగా మెలిగే అవకాశం కలిగింది. శ్రవ్య మాధ్యమాన్ని సుసంపన్నం చేసిన లబ్ద ప్రతిష్టులెందరితోనో పరిచయ భాగ్యం కలిగింది. ఉద్యోగమంటూ చేస్తే ఆకశవాణిలోనే చెయ్యలి అనే ఆశ కోరిక కలిగి కాలం గడిచేకొద్దీ అది బలంగా వెళ్లూనుకుంది. ఆ కోరిక వెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. మొత్తానికి సాధించాను. రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగానికి స్వస్థి పలికి, ఆకాశవాణిలో చేరాను.కొంత కాలం కడప ఆకాశవాణి కేంద్రంలో పనిచేశాను. ఆ సమయంలో శ్రీ దేవళ్ల బాలకృష్ణగారు, శ్రీ గొల్లపూడి మారుతీరావు, డా.ఆర్.అనంత పద్మనాభరావుగార్లతో కలసి పనిచేయడం, నాకు ఎన్నొ అనుభూతులని మిగిల్చింది. అక్కడినుండీ బదిలీ మీద హైదరాబాదు దూరదర్శన్‌లో ప్రవేశించాను. ఆ బదిలీ నా వృత్తిగత జీవితంలో పెద్ద మలుపు. శ్రవ్య మాధ్యమంలోంచి నేను దృశ్యమాధ్యమంలోకి ప్రవేశించాను.
చాలా ఏళ్ళ క్రిత౦ మీరు నిర్వహి౦చిన జాబులు జవాబులు కార్యక్రమ౦ ఇప్పటికీ ప్రజల మనసులలొ ఉ౦ది. అటు తరువాత ఆకార్యక్రమాన్ని నిలిపి వేశారు. కారణ౦ ఏమిటి మరలా ఆ కార్యక్రమాన్ని మీరు నిర్వహి౦చే అవకాశం ఉ౦దా అ౦టే"మీరన్న మాట నిజమే. ఇప్పటికీ ఆ కార్యక్రమ౦ ప్రజల మనసుల్లో వు౦ది. ఈ నాటికి అక్కడక్కడ ప్రేక్షకులు "జాబులు-జవాబులు పార్వతీశ౦" అనే పిలుస్తూ౦టారు. నిజానికి ఈ కార్యక్రమాన్ని టీవీ లొ నిర్వహి౦చడానికి పూర్వ౦ ’మీ ఉత్తరాలు’ పేరుతోరేడియొలో నిర్వహి౦చెవాళ్ల౦. ఉద్త్యొగ౦ లొ చేరిన కొత్త కాబట్టి, ఉత్సాహం ఎక్కువగా ఉండేది కాబట్టి ఏం చేసినా కొత్తగా చెయ్యాలని అనిపించేది. మామూలుగా రేడియోలో ఏదో వస్తూ ఉంటుంది, మనం ఏదో వింటూ ఉంటాం. ఇలా కాకుండా రేడియో మనతో మాట్లాడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన కలిగింది. ఆ అలోచనే మీ ఉత్తరాల కార్యక్రమంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాను. నేను చేప్పేది ముప్ఫై ఏళ్ల నాటి మాట. శ్రోతలు అనూహ్యంగా స్పందించారు. పదుల సంఖ్యలో ఉత్తరాలు వందలు దాటి వేల సంఖ్యలోకి పెరిగిపోయాయి. ఆ అనుభవంతోటే నేను దూరదర్శన్‌లో జాబులు-జవాబులు కార్యక్రమం నిర్వహించేవణ్ణి. ఏదో ఉత్తరాల కార్యక్రమమేకదా అని తెలిగ్గా తేసుకోలేదు. ప్రసారానికి రెండు మూడు రోజుల ముందునుచే చాల హోం వర్క్ చెసేవాణ్ణి. కార్యక్రమంలో చదవగలిగే పాతిక, ముప్ఫై ఉత్తరాలే ఐనా వచ్చిన వందలాది ఉత్తరాలని మొత్తం చదివేవాడిని. ప్రశంశలకన్నా నిర్మాణాత్మకమైన సూచనలు, విమర్శలు చేసే ఉత్తరాలకి ప్రాధన్యం ఇచ్చేవాణ్ణి.కార్యక్రమం నిర్మించేటప్పుడు వుండే సాధక బాధకాలు వివరించేవాణ్ణి. అలాగే నాకు ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ గొవిందు చౌదరి గారు నిర్వహించే తీరులోనుంచి మెలుకువలు నేర్చుకున్నాను. మొత్తంగా ఇవన్నీ కలిసి, ఈ కార్యక్రమానికి గణనీయమైన ప్రేక్షకాదారణ సంపాదించి పెట్టాయి. ఇక ఆ కార్యక్రమన్ని నిలిపివేయడానికి ప్రత్యేక కారణం ఏమీ లేదు. నా తరువాత కొంతమంది ఆ కార్యక్రమన్ని నిర్వహించారు. కారణాలేమైనా, ఆ కార్యక్రమంలో ఆకర్షణ తగ్గింది. అంచేత కాలక్రమంలో అది కనుమరుగైంది. ఇక మళ్లీ నేను నిర్వహించడమనేది బహుశా ఉండకపొవచ్చు. ఎందుకంటే కొత్త నీటికి చోటివ్వాలంటే పాతనీరు ముందుకి ప్రవహించాలికదా!"
పార్వతీశ౦గారికి ప్రత్యేక౦గా అభిమానులున్నారు. వారికి బుల్లితెర మీద కనిపిన్చడ౦ లేదు అ౦టే" నిజమేనండీ! చాలామంది అభిమానులున్నారు. వాళ్లే లేకపొతే, ఈ రోజున ఇలా 'సమీహ ' లో ఈ నాలుగు మాటలు చెప్పే అవకాశమే లేదుకదా! మూడున్నర దశాబ్దాల పూర్వం నేను ఆకాశవాణిలొ కాజువల్‌గా పనిచేసిన రోజులనుండీ నన్ను శ్రోతలు అభిమానించడం మొదలు పెట్టారు. ఒకరకంగా చెప్పాలంటే శ్రోతలు, ప్రేక్షకులు నాపట్ల చూపిన అభిమానమే నన్ను ప్రసార మాధ్యమంలో పనిచేసేలా చేసింది. ఐతే దీనివెనుక దూరదర్శన్‌లో ఎంతోమంది కార్యక్రమ ప్రయోక్తల ప్రోత్సాహం ఉంది. శ్రీ పి.వి.సతీష్, శ్రీమతి రమణి సన్వాల్, శ్రీ పి కె మాన్వి, శ్రీ ఆర్ ఆర్ కె శ్రీ, శ్రీమతి యమునా సంజీవ్,శ్రీమతి శైలజా సుమన్, శ్రీమతి యార్లగడ్డ శైలజ వంటి కార్యక్రమ ప్రయోక్తలు తమవంతు కార్యక్రమలలో నన్ను భాగస్వామిని చేసారు.అలా వారంతా ఇంచ్చిన అవకాశాన్ని సద్వీనియోగం చేసుకున్నాననుకుంటాను.ఫలితమే విశేషమైన ప్రేక్షకుల అభిమానం నాకు దొరికింది. ఇక పొతే ఇటీవల బుల్లితెర మీద కనిపించకపోవడానికి ప్రత్యేక కారణం ఏమీ లేదు. తెరముందు జీవితాన్ని తెరవెనుకకు మళ్ళించాను. ఉద్యోగాలలొ ఇవన్ని సాధారణమే."
ప్రస్తుత౦ మీరు చేస్తున్న కార్యక్రమాలేమిటి అ౦టే "ప్రస్తుతం నేను ప్రధానంగా ప్రయోజిత కార్యక్రమాల విభాగంలో భాద్యతలు నిర్వహిస్తున్నాను. ఈ విభాగంలో నేనుగా నిర్వహించే కార్యక్రమాలేవీ ఉండవు. బహుశా నేను ప్రేక్షకులకి బొత్తిగా కనిపించకపోవడానికి ఇదే ప్రధాన కారణం. ఐతే 'తెలుగు తోట ' శీర్షికతో సాహిత్య సంచికా కార్యక్రమం ధారావాహికంగా అందించాలని ఒక ఆలోచన."
తెలుగులో చాలా ఛానల్స్ వచ్చాయి. ప్రేక్షకుడు సప్తగిరి వెదికి చూసే కార్యక్రమాలు చేస్తో౦దా అని అడిగితే"టీవీ అంటే దూరదర్శన్ అనే రొజులనుండీ, ఇవాళ చానల్ స్కాన్‌లో దూరదర్శన్ ఎక్కడవుందా అని వెతుక్కునేంతవరకు చానల్స్ సంఖ్య పెరిగిపొయింది. అలాంటి తరుణంలో ఇన్ని చానల్స్ మధ్య ప్రేక్షకులు దూరదర్శన్ వెతికి పట్టుకొనే అవకాశం ఉందా అంటే ఉంది. ఐతే అలా వెదికేవారి సంఖ్య కొంత పలుచన కావచ్చు. నిజానికి దూరదర్శన్ information,education and entertainment.వాటి ప్రాధాన్యతా క్రమం కూడా అదే. మొదటి అంశానికి విస్తృతంగా చానల్స్ వచ్చాయి. అలాగే చివరికి అంశానికి కొరత లేదు. ఇక మిగిలందల్ల మధ్యలో వున్నది. అదే దూరదర్శన్‌కి గొప్ప ఆసరా. మన సంగీతం పట్ల, సాహిత్యం పట్ల, నాట్య కళల పట్ల, ఇతర లలిత కళలపట్ల, విద్య పట్ల, వ్యవసాయంపట్ల ఆసక్తి కలిగించే ప్రయత్నం దూరదర్శన్ మాత్రమే చేయగలుగుతుంది. మంచి కవితా గానాలను అస్వాదించాలంటే, ఉత్తమ శ్రేణి సంగీత విద్వాంసుల కచేరీలను వినాలంటే దూరదర్శన్‌లోనే సాధ్యమవుతుంది. అష్టావధానాలు, పద్యాల తోరణాలు, తెలుగు పద్యం అంద చందాలు, ఇలాంటి కార్యక్రమాలకోసం ప్రేక్షకులు దూరదర్శన్ వెదికి పట్టుకోవలసిందే." తెలుగు భాషాభివృద్ధి కోస౦ ఈ-తెలుగు లా౦టి స్వచ్హ౦ద స౦స్థలు పనిచేస్తున్నాయి.వాటికి మీరు సహకరి౦చగలరా? మన భాషాభివృధ్ధి కోసం ఈ వ్యవస్థలో చాలా మంది వ్యక్తులు, సంస్థలు కృషి చేస్తున్నాయి. కొన్ని పత్రికలు కూడా విశేష కృషి చేస్తున్నాయి. ఇలాంటి కృషిలో భాగమే ఈ-తెలుగు కుడా. ఇది ప్రశంసార్హమైన విషయం. మన తెలుగు భాషభివృధ్ది ఇంకా పటిష్టంగా వుండాలంటే సంస్థలు, వ్యక్తుల మధ్య ఒక సమన్వయం కావాలి. ఒక సరియైన అవగాహన, కలిసిగట్టుగా పనిచేయగలగాలి. నేను ఇప్పటికే చాలా భాషా సంభంధమైన సంస్థలలో భాగస్వామిగా ఉన్నాను. ఈ-తెలుగు కూడా తన కృషిలో నా భాగస్వామ్యం అవసరమనుకుంటే, నేను అందించాడానికి సిద్ధంగానే ఉన్నాను.
కుటు౦బ విషయాలగురి౦చి అడిగినప్పుడు "నేను చాలా రకాలుగా అదృష్టవంతుడిని. ఆ అదృష్టంతొపాటు దురదృష్టం కుడా వెన్నంటే వుందని అర్ధమైంది. మా నాన్న గారు శశాంక చాల చిన్న వయస్సులోనే పరమపదం చేశారు. మా కుటుంబంలో ఒక దీప స్థంబంలా నిలిచిన మా అమ్మగారు శ్రీమతి హైమావతి కుడా నడివయస్సునాటికే పరమపదం చేశారు. అలాగే మా తమ్ముడు రామభద్రరావు నడివయస్సుకుడా చేరకముందే నాలుగు పదుల వయస్సులో మా అమ్మని నాన్నని అనుసరించాడు. ఇక అన్నిటికి మించిన దురదృష్టం నా శ్రేమతి వోలేటి కృష్ణకుమారి ఇటేవలే ఒక సంవత్సరం క్రితం అకస్మాత్తుగా కన్నుమూసింది. ఆమె అకాల మరణం జీవితం నిర్వీర్యం ఐనట్లుకనిపిస్తోంది. నా ప్రసార మాధ్యమ జీవితంలో వీరిద్దరిదీ చాలా కీలకమైన భూమిక. ఆ ఇద్దరూ నిష్క్రమించడం, జీర్నించనలవికాని దురదృష్టం. ఇక ప్రస్తుతం నేనూ, మా ఇద్దరు అబ్బాయిలు. పెద్దవాడు శశాంక, మా నన్నగారి పేరే. బి.టెక్. చివరి సంవత్సరం చదువుతున్నడు. రెండవవాడు హేమంత్. మా అమ్మగారి పేరు హైమావతి కావడం, ఈ పిల్లవాడు మగపిల్లవాడు కావడంవల్ల ఆ పేరు పెట్టే అవకాశం లేక హేమంత్ అని పేరు పెట్టాను. బి.టెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చిన్నవయస్సులొనే కష్టాలు ఎదురొచ్చినా చాలా పరిణత మనస్కులై వ్యవహరిస్తారు. అది భగవంతుడు వారికిచ్చిన వరమే. చివరిగా ఒక్క మాట చెప్పాలి. మూడున్నర దశాబ్దాల క్రితం మా అమ్మగారి కోరిక ఒకటి తీర్చాలని ఇటీవలే నెరవేర్చాను. యార్లగడ్డ బాల గంగాధరరావు గారి సౌజన్యంతో తెలుగులో నామవిగ్జ్యాన శాఖలో ఒక పరిశొధన పూర్తి చేశాను. ఆ సిద్ధాంత వ్యాసాన్ని బెర్హంపూర్ విశ్వ విద్యాలయం వారికి పి.హెచ్.డి. పట్టా కోసం సమర్పించాను. ఆ లాంచనాలన్ని ఇటీవలే ముగిశాయి. అదృష్టం ఆలంబనగా నాకు సంక్రమించిన ఈ పేరు ముందు ఇప్పుడు ఒక అక్షరం వచ్చి చేరనుంది. అదే డా. (డాక్టరేట్)"

జీవితాలని అందమైన గులాబి తొ పోలుస్తారు కవులు. ఎ౦దుకో ఇప్పుదు అర్ధమై౦ది. ఎ౦తొ అ౦దమైన రూప౦,చక్కని గుభాళి౦పు మాత్రమే మనము చూస్తాము. కానీ దానికున్న ముళ్లు మనకు కనబడవు. జీవిత౦ కూడా అలా౦టిదే.
పార్వతీశ౦ గారికి అ భగవ౦తుడు మనస్థైర్యాన్ని ఇవ్వాలని, పార్వతీశ౦గారు చక్కని కార్యక్రమాలుప్రేక్షకులకు అ౦ది౦చాలని మనసారా కొరుకుంటూ ... సమీహ.
పార్వతీశ౦ గారికి అ భగవ౦తుడు మనస్థైర్యాన్ని ఇవ్వాలని, పార్వతీశ౦గారు చక్కని కార్యక్రమాలుప్రేక్షకులకు అ౦ది౦చాలని మనసారా కొరుకుంటూ ... సమీహ.