జరిగిన ఎన్నికలలో ప్రతీ పార్టీ తెలంగాణా అంశంనుండి లబ్ది పొందాలనే చూసాయి. కర్ర విరగకుండా పాము చావకుండా తమపని కానిచ్చేయాలని అటు (టీఅరెస్తో చేరి) తెలుగు దేశం పార్టీ, ప్రత్యేక తెలంగాణా కోసమే జన్మించిన టీఆరెస్, విభజనకు(మధ్యస్తంగా) సరేనంటూ పీఅర్పి కుడా వంత పాడాయి. కాని ఎన్నికలఫలితాల సరళిని చూస్తే తెలంగాణ సమస్య ప్రజల సమస్య కాదని ఇది కేవలం ఒక రాజకీయ సమస్య మాత్రెమే అనిపిస్తొంది. మొదటినుండి తెలంగాణ విభజనకు సశామీరా అన్నది ఒక్క రాజశెఖర రెడ్డి మాత్రమే. అవినీతి పెరిగిపోయిందని ప్రజలలో ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలోకి మార్చుకుందామని ప్రయితించిన చంద్ర బాబుకు ఒక్క విషయంలో ఎదురు దెబ్బ తగిలింది. అదే తెలంగాణా అంశం. ప్రజలో వైయసార్ పట్ల కొంత వ్యతిరేకత ఉన్నా తెలంగాణా అంశం విషయంలో ఆయన (చంద్ర బాబు) అంచనాలు తారుమారయ్యాయి. టీఆరెస్తో పొత్తే ఇప్పుడు ఆయన కొంప ముంచింది.రాష్ట్రంలో తొలి విడత ఎన్నికలు అయ్యాక టీఆరెస్ ను కొంత దూరం పెట్టి ఉత్తరాంధ్రలో పర్యటించారు. వాగ్దానాలు గుప్పించారు. కానీ ప్రజలు ఆయన మాటలు నమ్మేరొ లేదో గానీ రాజసేఖర రెడ్డి మాత్రం గోదావరి జిల్లాలలో పర్యటిస్తూ ఒకే మాట అన్నారు. సమైఖ్య ఆంధ్ర కావాలెంటే కాంగ్రెస్కు ఓటు వేయండని. లేకపోతే హైదరాబాదులో విదేశీయుల్లాగ జీవించాలని. హైదరాబాదులో కాలు పెట్టే అవకాశం ఇకముందు అక్కడివారికి ఉండదని. ఆ అంశాన్ని స్పష్టం చెయడంవల్ల ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ కు అనుకున్నదాని కన్నా ఎక్కువ సీట్లు వచ్చాయి. పీఆర్పీకి స్థానం లేకుండా చేశాయి. తెలుగుదేశం పార్టీని కోలుకోలేని దెబ్బ తీసింది. ఆ విషయంపై కాంగ్రెస్ లో మిగిలిన తెలంగాణా పెద్దలు గొల్లుమన్నారు. పార్టీ పూర్తిగా బ్రష్టు పడుతుందని డిల్లీ పెద్దలకు వార్నింగులు ఇచ్చారు. అలా తెలంగాణాను వెనకేసుకొచ్చిన పెద్దలు కూడా ఈ ఎన్నికలలో ఓడిపోవడం చూస్తే తెలంగాణా అనేది ప్రజా సమస్య కాదనే విషయం మరింత బలపడుతోంది. ప్రస్తుతం ఈ వ్యాసం వ్రాసే సమయానికి టీఅరెస్ అధినాయకుడు పురిటి నొప్పులు పడుతున్నారు. ఆయన నెగ్గుతారో లేదో కూడ తెలియని పరిస్తితి. ఇక పీఅర్పీ పరిస్తితి చెప్పనక్కర్లేదు. చిరంజీవి పాలకొల్లులో ఓడిపోవటం కూడా దీనిని బలపరుస్తొంది. కాబట్టి "రాజశేఖరా నీపై మోజుతీరలేదురా " అని మరో ఐదేళ్ళు పాడుకోవడమే.
16, మే 2009, శనివారం
15, మే 2009, శుక్రవారం
జ్యొతిష్య శాస్త్రంపై హేతువాదుల చాలెంజ్
ఈ ఎన్నికలలో ఏ పార్టీ విజేత అవుతుండో చెప్పగలరా అని కలకత్తాలో హేతువాదులు జ్యొతిష్యులను చాలెంజ్ చెసారట. జాతకాలనేవి వ్యక్తులకు ఉంటాయిగానీ పార్టీలకు కాదు. ఈరోజు టీవీలలో కనిపించే జాతక బ్రహ్మ్మలు విషయ పరిజ్గ్యానంకన్న డబ్బు సంపాదనలో పరిజ్గ్యానం ఉన్నవారే ఎక్కువ. నిజమైన పరిజ్గ్యానం ఉన్న వ్యక్తులు వారిచ్చే డబ్బులకు జాతకాలు చెప్పరు. వీరు చేసే బోడి చాలెంజ్లకు సరే అనరు. మా వూరిలో (అనగానే కహానీ అనుకోకండి) ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన జీవనం మావూరి సత్రంలోనే. ఆయనను అందరూ సత్రవు వెంకన్న గారూ అనేవారు. ఆయన దగ్గరకు వెళ్ళిన వ్యక్తి ఆయనకి సమస్య చెప్పనవసరం లేదు. జ్యొతిష్య శాస్త్రం ప్రకారం వచ్చిన వారు ఎవరిగురించి ఏ సమస్యతో వచ్చరో చెప్పి ఆయనే మనం ఎదుర్కొంటున్న సమస్యకి ఎప్పుడు పరిష్కారం అవుతుందో చెప్పేవాడు. ఆయనకి వొంటిమీద చిన్న అంగవస్త్రం తప్ప మరేమి కట్టుకోవడానికి కుడా ఉండేది కాదు. సత్రవులో కుటుంబంతో జీవనం. ఆయనదగ్గరకు వెళ్ళినవళ్ళు రూపాయో రెండో ఇస్తే దానితోనె జీవించేవాడు. సరస్వతి కటాక్షం ఉందిగాని లక్ష్మీ కటాక్షం లేదని ఊరిలో అందరూ అనుకొనేవారు. ఇలాంటి విషయాలలో వితండ వాదం చెసేవారిని సమాధాన పరచలేము. జ్యొతిష్యం నిజమైన శాస్త్రం. ఎటొచ్చిదానిలో పూర్తి విషయజ్గ్యానం ఉన్నవాళ్ళు లేరు (తక్కువ). గాలి కంటికి కనిపించదని గాలి లేదని అనడం లాంటిదే జ్యొతిష్య శాస్త్రం కూడ అబద్ధం అనడం. ఇదికూడా హేతువాదులు వారి పబ్లిసిటీకోసం చెసే ఒక తంతు. ఎవరు గెలుస్తారోనని వారి సందేహం తీర్చుకోవాడానికి కుడా కావచ్చు. :)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)